కల్యాణ వృష్టి స్తవం ;- కొప్పరపు తాయారు.
🌟 శ్రీ శంకరాచార్య విరచిత 🌟

15)
హ్రీం  కారమేవ తవనామ తదేవ రూపం త్వన్నామ దుర్లబ మిహతి పురే గృణన్తి !
త్వత్తేజసా పరిణతం వియదాది భూతం
సౌఖ్యం తనోతి సరసీరుహ సంభవాదేః !!

భావం: ఓ త్రిపుర సుందరీ! 'హ్రీం' కారమే నీ పేరు.నీ రూపము. అది దుర్లభమైనదని చెప్పు చుందురు. నీ తేజస్సు చే ఏర్పడిన ఆకాశము మొదలగు పంచభూత సముదాయము బ్రహ్మ మొదలగు సమస్త జీవరాశికి సుఖమును కలిగించుచున్నది. 
               🪷🍀🪷


కామెంట్‌లు