నా పంచ పదుల సంఖ్య--- 1316.----------------------------------------------మానవ జన్మకి ఏది, ప్రాధాన్యము క్షేత్రమా,బీజమా?బీజమే ప్రధానం అన్నది ,మన ఘన భారతీయము!భువన సృష్టి విధాత ,ఎన్నడూ మనము చూడలేము!మన జన్మ సృష్టి మూలకర్త, నాన్న నిత్యం చూస్తున్నాము!అమ్మ, నాన్న, గురువు,ప్రత్యక్ష దైవాలు నిజము ,పివిఎల్!1317.జీవితాన ఆయన ,సాహచర్యం తరగని బలము!జీవన లక్ష్య సౌధ నిర్మాణ, సామర్ధ్యము, సారథ్యము!నీ జీవితం వేదంలా వెలుగు, ఆయన స్వేదం మూలము!ఆయన పంచప్రాణాలు, కుటుంబ పోషణకు పణము!కారకుడు, పోషకుడు,రక్షకుడు,శిక్షకుడు నాన్నే,పివిఎల్!1318.కుటుంబ వృత్త కేంద్రము, గ్రీష్మాన మలయ మారుతము!జీవన పురోగమన మూలం, సామాజిక గౌరవము!మనకు నాన్న తోడుంటేనే ,నా వాళ్ళు ఉంటారు, నిజము!మన తల్లి ఉన్నా, తండ్రి లోటు, జీవితాంతము శోకము!జీవనం తిమిరంతో సమరం తండ్రి తోడే విజయము !1319.నాయన ఉన్నంత కాలమంతా, మనకు కొండంత అండ!ఆయనిచ్చే భద్రతతో,జీవితం వాడని పూలదండ!నాన్న మాట వింటూ,ఆచరించాల, బతుకు కలకండ!ఆయనే జీవన నమూనా,బతుకు మరి చల్లకుండ!తండ్రి ఉన్నా, లేకున్నా ,తండ్రిమాట నిలబెట్టాలి,అన్నా,పివిఎల్!1320.మనము నాన్న నిచ్చెనగా, ఎక్కేసి ఎత్తున ఉంటాము!కిందనే ఉన్న నాన్న ఎత్తు,ఆ హిమాలయ శిఖరము!మన ఎదుగుదలలో,ఆయనది కర్మ సిద్ధాంతము!మరి మనకున్న కర్తవ్యము, పితృదేవ స్మరణము!నాన్నగా ,కొడుక్కి, నాన్న పేరెట్టి,పిలుస్తూ మురియాలి,పివిఎల్!_________
సరిలేరు నాన్నకు ఎవ్వరు! (పంచ పదులవందనం);- డా.పివిఎల్ సుబ్బారావు.విజయనగరం..
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి