926)దుస్వప్న నాశనః-
చెడుకలలను తొలగించువాడు
ప్రశాంతనిద్ర నిచ్చునట్టివాడు
దుస్వప్ననాశనం చేయుచున్నవాడు
భక్తులకభయమిచ్చుచున్నవాడు
శ్రీ విష్ణుసహస్ర నామాలు ఉమా!
927)వీరహా -
భక్తులమనసు క్రమపరచువాడు
మార్గదర్శనం చేయుచున్నవాడు
కర్తవ్యమును పాటించుచున్నవాడు
వీరహా నామము గలిగినవాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
928)రక్షణః -
రక్షించుభావనలో యున్నట్టివాడు
స్వామియైన భగవానుడైనవాడు
కాపాడుతత్వముయుండినవాడు
రక్షచేయగలిగిన సమర్థుడు
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
929)సంతః -
పవిత్ర స్వరూపుడైనట్టివాడు
భక్తులను ఒద్దికపరచువాడు
సంతృప్తిని కలిగించుచున్నవాడు
అందరినొక్కటిగా చూచువాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
930)జీవనః -
సర్వజీవులకు ప్రాణమిచ్చువాడు
జీవశక్తిని ప్రసాదించువాడు
చోదకత్వమును చేయుచున్నవాడు
కదలికలుకలిగించెడివాడు
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి