శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )ఎం. వి. ఉమాదేవి
911)శబ్దాతిగః -
-----------------
వాక్కునకు అందనంతటివాడు 
శబ్దాన్ని అధిగమించినవాడు 
మంత్రంతో గెలువలేనివాడు 
అద్భుతమైన వేదజ్ఞానవంతుడు 
శ్రీ విష్ణుసహస్ర నామాలు ఉమా!
912)శబ్ద సహః -

సమస్తవేదాలు తెలిసినవాడు 
జ్ఞానవచనములు పలుకువాడు 
వేదమును పఠిoచుచున్నట్టి వాడు 
ముఖసరస్వతిగా భాసిల్లువాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
913)శిశిరః -

శిశిరఋతువును పోలినవాడు 
చల్లదనమును పంచుచున్నవాడు 
ప్రకృతికి నిద్రనిచ్చువాడు 
ఆహ్లాదము కలిగించుచున్నవాడు
 శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
914) శర్వరీకరః -

రాత్రిని కలుగజేయునట్టివాడు 
వెన్నెలకురిపించుచున్నవాడు 
విశ్రాంతిసమయము ఇచ్చువాడు 
జీవులచల్లగా యుంచునట్టివాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
915) అక్రూరః -

క్రూరత్వము లేకుండినవాడు 
కరుణాసింధువు అయినవాడు 
దయాదాక్షిణ్యములు గలవాడు 
స్వామి సహృదయమున్నట్టి వాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు