931)పర్యవస్థితః -
===============
అన్నివైపులా వ్యాపించియున్నవాడు
అందరిలోనూ ఇమిడియున్నవాడు
సర్వత్రా కలిగియున్నవాడు
పర్యవస్థితమై నిల్చినవాడు
శ్రీ విష్ణుసహస్ర నామాలు ఉమా!
932)అనంతరూపః -
అనంతరూపములు గలవాడు
అవతారములు ధరించినవాడు
ప్రతిరూపములు గలిగినవాడు
అనంతరూప నామమున్నవాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
933)అనంతశ్రీః -
అంతమనునది లేనట్టివాడు
శక్తివంతునిగా నుండినవాడు
అనంతసిరులు ఇచ్చునట్టివాడు
భక్తులనాదరించగలవాడు
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
934)జితమన్యుః -
క్రోధమును ఎరుగనట్టివాడు
కార్పణ్యములు చూపనివాడు
ద్వేషభావములు అంటనివాడు
జితమన్యుయను నామధేయుడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
935)భయాపహః -
భయనివారణ చేయుచున్నవాడు
అండదండలుగా నిలుచున్నవాడు
కృపాకటాక్షణముల చూపువాడు
ధైర్యమును ప్రసాదించునట్టివాడు
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి