(కందములు )
============
81.
పురములు, హయములు, గజములు,
పరివారము గోరలేదు పరికింపవయా!
నిరతము నీసేవ సలిపి
పరమును బొందగ నడిగితి భక్తిగ శంభో!//
82.
చంపక సుమములు దెచ్చితి
నింపుగ నీ పాద పూజ హృష్టిగ సలుపన్
బెంపుగ గొలిచెద నిను
సొంపగు నీ రూపు గాంచ శుభమౌ శంభో!//
83.
అలకానది నీరముతో
పలుమారులు నీ శిరమున ప్రణతుల తోడన్
సలిపెద నభిషేకములను
గలిమల దూరా!సతతము కావర శంభో!//
84.
కురువంశపు మణీయగు ధీ
వరుడగు నరునికి మురియుచు బాశుపతంబున్
జిరయశ మొందగ నిచ్చిన
పరమేశా!నినుఁ గొలిచెద వరమిడు శంభో!//
85.
గంగా జలమును దెచ్చితి
బొంగుచు నీ సేవ జేయ ముదముగ రుద్రా!
జంగమ దేవర!దయగొని
చెంగట నాకిమ్ము కొలువు శివశివ!శంభో!//
.
============
81.
పురములు, హయములు, గజములు,
పరివారము గోరలేదు పరికింపవయా!
నిరతము నీసేవ సలిపి
పరమును బొందగ నడిగితి భక్తిగ శంభో!//
82.
చంపక సుమములు దెచ్చితి
నింపుగ నీ పాద పూజ హృష్టిగ సలుపన్
బెంపుగ గొలిచెద నిను
సొంపగు నీ రూపు గాంచ శుభమౌ శంభో!//
83.
అలకానది నీరముతో
పలుమారులు నీ శిరమున ప్రణతుల తోడన్
సలిపెద నభిషేకములను
గలిమల దూరా!సతతము కావర శంభో!//
84.
కురువంశపు మణీయగు ధీ
వరుడగు నరునికి మురియుచు బాశుపతంబున్
జిరయశ మొందగ నిచ్చిన
పరమేశా!నినుఁ గొలిచెద వరమిడు శంభో!//
85.
గంగా జలమును దెచ్చితి
బొంగుచు నీ సేవ జేయ ముదముగ రుద్రా!
జంగమ దేవర!దయగొని
చెంగట నాకిమ్ము కొలువు శివశివ!శంభో!//
.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి