స్ఫూర్తి దాతలు 4! అచ్యుతుని రాజ్యశ్రీ

 మయూరి సినిమా అందులో సుధాచంద్రన్ నటన చాలా మందికి  గుర్తు ఉంది. మరి ఇప్పుడు కూడా అలాంటి యువతి దివ్యాంగురాలు అంజనశ్రీ కూచిపూడి నృత్యం నేర్చుకుని తన సత్తా చాటుతోంది. 4 ఏళ్ల వయసులో  స్కూల్ బస్సు ఢీ కొట్టటం తో ఎడమకాలు పోయిన ఆమె కి రోడ్డు ప్రమాదంలో రెండోకాలికి దెబ్బ తగిలింది. కాళ్ళకి రాడ్ వేశారు. జగిత్యాల జిల్లా రామాజిపేటకి చెందిన ఈపాపబడిలో 7వక్లాస్ చదువుతూ కూచిపూడి నృత్యం లో కృత్రిమ కాలు సాయంతో 50పైగా నృత్యప్రదర్శనలు ఇచ్చి రాష్ట్ర స్థాయిలోనూ అవార్డ్స్ పొందింది. ప్రతి2 ఏళ్ల కోసారి కాలు మార్చాలి.ఖర్చు ఎక్కువ దాదాపు  2 లక్షలు దాటుతుంది. సుధాచంద్రన్ వీడియో కాల్ తో ఆమె తో మాట్లాడటంతో ఆపాప ఆనందం వర్ణనాతీతం.అక్సానా సోల్టాన్ తన 15 వ ఏటనే ఎన్ హాన్సింగ్ చిల్డ్రన్స్ లైవ్స్ అనే సంస్థను ప్రారంభించారు. ఇందులో 2500మంది వాలంటీర్లు ఉన్నారు. ప్రపంచంలో ని బాలికలకోసం చదువు నేర్పటం వారి పని.అక్సానా  రిచ్మండ్ లోని వర్జీనియా కామన్వెల్త్ యూనివర్సిటీ లో క్రిమినల్ జస్టిస్ చదివి హ్యూమన్ రైట్స్ లాయర్ గా పనిచేస్తున్నారు.ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన ఈమె కుటుంబం తాలిబన్ల యమయాతనలకు గురైంది. మగపిల్లాడి డ్రెస్ లో అండర్గ్రౌండ్ బడిలో  తల్లి ఇంకో టీచర్  చదువు చెప్పేవారు. ఆపై ఆమె కుటుంబం శరణార్ధి శిబిరంలో ఉజ్బెకిస్థాన్లో ఉంది. తండ్రి ఇంజనీరు ఐనా ఏంలాభం?  శిబిరాల్లో ప్రాణాలు దక్కాయి. కానీ రకరకాల సమస్యలు!యునిసెఫ్ సాయంతో 40మంది అమెరికా చేరారు.12 ఏళ్ల  అక్సానా సోల్టాన్ రకరకాల చేదు అనుభవాలు రుచి చూసి  నేడు ఐ.రా.స.సాయంతో రిచ్మండ్ వర్జీనియా  హైతీ ఆఫ్ఘనిస్తాన్ లో బాలికలకు బట్టలు పుస్తకాలు మొదలైనవి అందిస్తోంది. మరి ఇలా ధైర్యం ఉత్సాహం ఉత్తేజం ఉన్న  ఈమెలా ప్రతివారూ ఉండాలి 🌹
కామెంట్‌లు