ఆకాశవాణి విజయవాడ కేంద్రం;;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 అ ఆ  నేర్చిన నేర్పిన అక్కినేని గారు మహా మేధావి లౌక్యం తెలిచినవాడు కదా భారతం లో ధర్మరాజు సమాధానాలు జ్ఞాపకం వచ్చేలా నేటి అక్కినేని కి ఉన్న పరిణతి నాటి నాగేశ్వరావుకి లేదు నాటి నాగేశ్వరరావు కు ఉన్న వయస్సు పరిణితి చెందిన ఈ అక్కినేని కి లేదు అని కడుపారా నవ్వారు  మీకు డైలాగ్ చెప్పడం చేతకాదు కదా అనగానే  అదేమిటి సంభాషణ చెప్పడం నాకు సావిత్రి కి తెలిసినంతగా మరి ఎవరికి తెలియదని ఆచార్య  ఆత్రేయ అనేక సందర్భాలలో అంటూ ఉండేవాడు  కారణం ఆత్రేయ గారు స్క్రిప్ట్ మీకు వినిపించేటప్పుడు దానిని పుణికి పుచ్చుకొని అనటం అలవాటయింది అది ఆత్రేయ గారి విషయంలో నిజం కావచ్చు కానీ మిగిలిన వారి విషయంలో నిజం కాదు  మా రేడియోలో నండూరి కి సినిమాలలో మీకు ప్రతి వాక్యం చివరి అక్షరాలను తినే అలవాటుంది దాని వల్ల దీర్ఘం హ్రస్వ0 అయ్యే ప్రమాదం ఉంది దాంతో విపరీతమైన అర్థం వ్యతిరేక అర్థము స్పురించవచ్చు.మీ వివరణ విన్న తర్వాత నేను చేసినది పొరపాటే అని అనిపిస్తోంది అని ఎంతో నిజాయితీగా సమాధానం ఇచ్చిన అక్కినేని గారి వివరణ  స్వతహాగా నా  నట జీవితం పౌరాణికం తో ప్రారంభించి జానపద కథానాయకునిగా కొనసాగినప్పుడు ఆ ప్రక్రియలో ఆ దీర్ఘాన్ని చెప్పే వరవడి అలవాటయింది తర్వాత ఘంటసాల వారి కథానాయకుడిగా స్థిరపడ్డ తర్వాత అనేకసార్లు అంత దీర్ఘం వద్దని అనేకసార్లు కోపగించుకున్నారు కూడా ఆ సందర్భంగా దీర్ఘాన్ని హ్రస్వo చేసే ప్రయత్నంలో మరీ తగ్గించి పలకడం జరిగి ఉండటంతో మీరు చెప్పిన తప్పు జరిగి ఉండవచ్చు అయితే ఈ క్షణం వరకు ఏ దర్శకుడు దీనిని పట్టించుకోలేదు నా దృష్టికి తీసుకురాలేదు వారు గనక చెప్పి ఉంటే తప్పకుండా సరిచేసుకొని ఉండేవాడిని.
నిజానికి ఆనంద్ గారు మీకు మాకు మాధ్యమాలలో తేడా ఉన్నది మీది వాచ్యం మాది దృశ్యం మా నటన వల్ల అక్షరాలను అంతగా పట్టించుకోరు మీరు ఆకాశవాణి నుంచి వచ్చారు కనుక మీకు ఈ దోషం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది మీరు వ్యక్తిగా నటుడిగా దేనిలో విజయవంతమయ్యారు అని అడిగిన దానికి  రెంటిలో విజయన్నే సాగించాను అనేక అద్భుత పాత్రలను ధరించి దేశ విదేశాలలో కూడా కోట్ల సంఖ్యలో అభిమానులను సంపాదించుకోగలిగాను ప్రభుత్వం ప్రజలు ఎన్నో సత్కారాలు సన్మానాలు చేసి బిరుదులు అందించారు  ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థితిలోనే ఉన్నాను అనుకుంటున్నాను నా సహదర్మచారిని అన్నపూర్ణ సహకారంతో పిల్లలను తీర్చిదిద్దగలిగాను అంతకుమించి నాకు ఇంకేం కావాలి అని ఎంతో తృప్తిగా శ్యాసించారు అక్కినేని గారు.
====================================
సమన్వయం ; - డా. నీలం స్వాతి 

కామెంట్‌లు