రమః అంటే రమించేవాడు అంటే అంకిత భావంతో చేసేవాడని శబ్దం చాట ఏం చేస్తుంది తనలోనికి వచ్చిన వస్తువుకు పట్టిన దుమ్ము దూళిని దూరం చేస్తుంది మరిచేట కు బహువచనం అని గమనించాలి అది ఏం చేస్తుంది అనేక చేటలు ఎంత గాలిని సృష్టిస్తాయి ఇది రైతులకు అర్థమయ్యే పదం పొలంలో రాసి పోసినవడ్లను చాట్లతో విసిరి శుద్ధి చేస్తారు ఆ రాశి ఇంటికి చేరుతుంది ఇక్కడ శ్రీరాములు గారు చేసే పని అదే నాటక రంగానికి సంబంధం లేని మన ఇష్టం వచ్చిన విద్యార్థిని ఆయన వద్దకు పంపితే అతన్ని అత్యుత్తమ పరిణతి చెందిన మంచి కళాకారులుగా తీర్చిదిద్ది మనకు అందిస్తారు అలాంటి వారికి మనం ఇచ్చే గౌరవం ఏమిటి అడ్డమైన వాళ్లను మన అవసరాలు తీర్చేవాడు మనకు అడ్డుగా నిలిచిన వారిని తప్పించే ప్రయత్నం.
కళా ప్రపూర్ణులను చేస్తున్న మనం వీరికి ఒక కళను ఇవ్వలేమా అందుకేనాకనిపిస్తూ ఉంటుంది ఎవరు గుర్తించిన గుర్తించకపోయిన ఆయన ఎప్పుడు కళా ప్రపూర్ణుడే నా అభిప్రాయంతో ఏకీభవించి అభినందించిన సీవి గారికి కృతజ్ఞుడిని ఈ వ్యాసం రచించడమైన తర్వాత మూడు నెలలకే చాట్ల వారికి విశాఖ విశ్వ విద్యాలయం డాక్టర్ ప్రధానం చేయడం కాకతాళీయమే ఇవాళ రంగస్థలం మీద నాటకం ప్రదర్శించిన ఆకాశవాణిలో నాటకం ప్రసారం చేసిన అది ఆరోజు ఆనందించడం కాదు పది పదిహేను సంవత్సరాల తర్వాత చూసిన విన్న నిత్య నూతనంగా ఉండాలి లేకపోతే అర్థం లేదు అన్నది సి వి సిద్ధాంతం ఎప్పుడో 86లో ప్రసారమైన త్యాగయ్య గంట నాటకం 2008లో రేడియో శ్రోతలు దూరవాణి ద్వారా నేటి సమాజానికి కూడా ఈ నాటకం ఎంత ప్రయోజనకరము తెలియ చెప్పినప్పుడు ఆయన పొందిన ఆనందం అంతా ఇంతా కాదు.
----------------------------\
సమన్వయం ; డా. నీలం స్వాతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి