పూలసోయగం;- అంకాల సోమయ్యదేవరుప్పుల జనగాం9640748497
 పల్లవి:
ముద్దు ముద్దు గున్నాయి
ముద్దబంతులు
మత్తుజల్లుతున్నాయి
మల్లెమొగ్గలు
సోకుజేసుకొచ్చాయి
చేమంతులు
చరణం1
గుసగుసలాడాయి
గులాబీలు
సరసమాడరమ్మన్నవి
సంపెంగలు
చరణం 2
కన్నుగీటుతున్నాయి
కనకాంబరాలు
మరులు గొలుపుతున్నాయి 
మందారాలు
చరణం3 
పూబాలసోకుచూడన్నాయి
పూలుకోసిఉసురుతీయకన్నవి
మానవ కోటికి ఆనందం కూర్చే
ఆహ్లాదవాటికదా పూలవనము 
చరణం 4
శాంతి సౌఖ్యాలనిచ్చేపూలు
సర్వశుభాలకుసంకేతాలు
అమరజవాను పై అలంకారం
ఉప్పొంగే పూ బాల హృదయం

కామెంట్‌లు