విజయపథం;- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగాం-9640748497
పల్లవి
ఆశ విడువకు అధైర్య పడకు 
బ్రతుకడమంటే --పోరాటం
నిత్యం జీవన గమనంలో
గెలుపోటములు సహజం --సహజం-2//

1)చరణం
శ్రీమంతులుకాదుగదా 
మనలనుగన్న తల్లిదండ్రులు
చదువులమ్మకు లేవుగదా
ధనిక పేద భేద భావాలు
పడుతూ లేస్తూ పరుగెత్తడమే
అంతిమ విజయ లక్ష్యం
వేదన యాతనలెన్నున్నా
పట్టుదల విడవొద్దన్నా..  //

2)చరణం
పేదరికం వెంటాడుతువుంటే నీరుగారిపోకు
నిరాశలెన్నో ఎదురైనా
అధిగమించడం నీ వంతు
నిత్యం జ్వలించే ఆశయాలతో
నీ బ్రతుకును నీవే వెలిగించు
విజయం పొందిన అనుభవాలను
అందరికి నువు  అందించు  //

3)చరణం
ఉద్వేగం కలుగుతు వుంటే 
ఉద్రేకం అదుపున వుంటే
ఓరిమి కూరిమి నీకు బలం
 లేమికి పలుకుదాం చరమ గీతం
నీ బ్రతుకును నువ్వే గెలిపించు
నవ సమాజం నువ్వే నిర్మించు



కామెంట్‌లు