వానరాకకైఎదురుచూపులు!;- అంకాల సోమయ్య దేవరుప్పుల-జనగాం-9640748497
ఏరువాక పున్నంబాయే
వాన రాకపాయే
ఏరుపారకపాయే
గొడ్డు మేఘం వర్షించక
కర్షక లోకం వాన చినుకై కొండకెదురు
చూసినట్టు చూసుడాయే

కల్లాకపటం యెరుగని 
రైతులు వర్షం
 తోనేకదాకృషీవలురు హర్షం వ్యక్తపరిచేది

రైతు తాను చేసిన తప్పు ఏమిటో?!
తనకు తెలియకపాయే

 వానరాకడ
ప్రాణం పోకడ ఎవడికి తెల్వదంటరు 
మోసకారి మేఘుడు రైతులపై
సీతకన్నుచూస్తే

నీరులేక పంటభూములు బీడైపాయే
కన్నతల్లి లాంటి నేల తల్లే
 ఏడుకేడు నష్టమేజేస్తదా ?!
పోయినేడుపంటచేనుకు పురుగుతలిగి పంటంతాగౌసుపాయే?

(ఈ యేడు) తండ్రిలాంటి ఆకాశమే వానరాకడను అడ్డుకున్నాడా!?

ఎటూ పాలుపోక నిస్తేజంగా పోయినేడాది తీర్చగా మిగిలిన అప్పులు
 ఈ ఏడు కొత్తగా
తెచ్చిన అప్పులు, నాగులకుతెచ్చిన
పెసర్లు కందులు మినుములు ఎత్తుకు రెండెత్తులు 
 తీర్చేదెట్లాదేవుడా!?
ఈ ఆరిద్రకార్తి ఒరుపిస్తే?
ఆరుకార్తులు ఒరుపిచ్చినట్టే?!
ఇక వానపడనట్టే ---!?
చేసిన అప్పు మెడమీద కత్తాయే?!

ఈ రైతు కూలీల ఎతలు తీరేదెన్నడో?!
మేఘం వర్షించి కర్షక లోకం
హర్షాతిశయం కలిగేదెన్నడో--!?
పురుగుమందే పెరుగన్నం
మవుతుందో !?
రైతును రాజ్యం రాజును చేస్తుందా!?
బికారినిచేస్తుందా!?
పంటలభీమాపథకం వర్తింపజేసి రైతులను
ఈ కష్టకాలంలో మీకుమేమున్నామంటుందా!?
ఇది వేయిడాలర్ల ప్రశ్న---?!


కామెంట్‌లు