ఉపయోగం చాలా;- -గద్వాల సోమన్న,9966414580
కొలనులోని కలువలు
మేనులోని వలువలు
ఉపయోగం చాలా
మనిషిలోని విలువలు

చెట్టుకున్న ఆకులు
పక్షికున్న ఈకలు
ఉపయోగం చాలా
చేతికున్న రేఖలు

చేనులోని పైరులు
మ్రానులోని ఫలములు
ఉపయోగం చాలా
చెరువులోని జలములు

మింటిలోని తారలు
కాంతిలోని కాంతులు
ఉపయోగం చాలా
ఇంటిలోని బాలలు

వనంలోని పూవులు
ముఖంలోని నగవులు
ఉపయోగం చాలా
గృహంలోని వనితలు


కామెంట్‌లు