కొత్తగా రెక్కలొచ్చిన పక్షి
ఎగరాలని ఎంతో కోరికతో
నిదురపోక కుదురు లేక
ఎదురు చూచు కొత్త వేకువ
తెల్లవారితే రెప్ప విప్పి
లోకం చూసే ఆతురతతో మొగ్గ
రేకులన్నీ ఒకొక్కటిగా తెరచి
పువ్వుగ విరిసే ముచ్చటైన వేకువ
నులివెచ్చగ తాకే కిరణాల
పాదాలు కడగాలని.రాత్రంతా తలమీద మంచుమోసిన
పచ్చిక వేచిన వెచ్చని వేకువ
నారింజ రంగులు నింపిన
రంగవల్లుల తీర్చి రథము వచ్చే
దారినంతా చూపులు పరచిన
నీలాల నింగి నిరీక్షించే వేకువ
నీరు నిండిన కరి మబ్బులు
కొండల నడుమ దర్శనమిచ్చే
వేయివెలుగుల వెలుగుపువ్వుకై
కురవకుండా నిలిచి చూచే వేకువ
రేపటి కోసం చీకటి తానే
తప్పుకునే కోరికతో
వెలుతురొచ్చు వేళ అయినా
వీడిపోక తొంగి చూస్తున్న వేకువ
అందరికీ అమృతప్రాయంగా
అవకాశం అందిస్తానంటూ
అలుపెరగని పయనంలో
ఆనందం తెస్తానంటూ వచ్చే వేకువకు
🌸🌸 సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి