శిలల పైన సాగే
సెలయేటి తీరున
ఒడి దుడుకుల తోవ
సాగేటి బ్రతుకు నావ
అలల కదలికలకే
అటునిటు ఊగేను
అలజడికి వెరచి
అంతరంగాన వగచేను..
జగతి మొత్తం పచ్చగున్నా
తనకే ఎందుకీ వేదననుచు
మరిమరి తలచి మనసులోనే
చిక్కుముడులు వేసుకునేను
గడచిన ఏ క్షణమూ ..
తిరిగి రానే రాదనీ
వెతలు ఏవైనా వేదనలెన్నైనా
కదలక అలాగే నిలిచిపోవనీ
తెలిసీ....తెలియని మాయలో
ఊహలోనే వేయింతలు
అనుభవించి....చేతిలోని
సమయాన్ని జారవిడుచుకోక
గమనాన్ని గతి తప్పనీక
పయనాన్ని అసలు ఆగనీక
గమ్యాన్ని చేరుదాక
ధైర్యాన్ని వీడక ఉండమనీ...
అనుకోని అదృష్టాలు
కనపడని కటాక్షాలు
ఆదుకునే ఆపన్న హస్తాలు
అందించే ఆనందాలకు
సిధ్ధంగా ఉండమనే సిరివెలుగుల
వేకువకు
🌸🌸సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి