చూడు వర్షమా
చెట్లు వాడిపోతున్నాయి
పొలాలు బీడువారుతున్నాయి
గొంతులు ఎండిపోతున్నాయి
వర్షమా
అలగకు
మొహమును
చాటేయకు
వర్షమా
కోపపడకు
హర్షాన్ని
దూరంచేయకు
వర్షమా
దాగుకొనకు
ప్రార్ధనలను
పెడచెవినపెట్టకు
వర్షమా
కదులు
వాగులు
పారించు
వర్షమా
కరుణించు
కరువుకాటకాలు
రానీయకు
వర్షమా
విన్నపాలువిను
ప్రాణులను
పరిరక్షించు
వర్షమా
ఆషాడమైనాపరవాలేదు
శ్రావణమాసమువరకు
వేచియుండకు
వర్షమా
కుండపోతగాకురువు
కాలవలుపారించు
జలాశయాలనింపు
పిల్లలపై
తల్లి అలగవచ్చా
భక్తులపై
దేవుడు కినుకవహించవచ్చా
వర్షమా
అర్ధంచేసుకో
కవికోర్కెను
అంగీకరించు
వర్షం
ప్రత్యక్షమయ్యింది
జల్లులు
ప్రారంభించింది
వర్షం కవికోరిక
తీరుస్తానన్నది
సరస్వతీదేవిని
సంతృప్తపరుస్తానన్నది
వర్షానికి
వందనాలు
ప్రాణులకు
శుభాకాంక్షలు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి