ఎప్పుడో;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 నీ కళ్ళల్లోంచి ప్రవహించే ప్రేమధారలను
అందుకోవడం ఎప్పుడో
నీ అధరాల్లోంచి ప్రవహించే అమృతధారలను 
జుర్రుకోవడం ఎప్పుడో
నీ హృదయంలోంచి ప్రవహించే క్షీరధారలను
పానం చేయడం ఎప్పుడో
నీ పవిత్ర పాదాలను నాహృదయానికి
ఆనించడం ఎప్పుడో
నీవాత్సల్యపూరిత అమృతహస్తాలు 
నన్ను నిలువెల్లా స్పృశించేది ఎప్పుడో
అనురాగం నిండిన నీ తనువెల్లా
నేను స్పృశించేది ఎప్పుడో 
నీ అంతరంగపు ఆత్మీయ అలజడులను
నేను శాంతపరిచేది ఎప్పడో
ఈ నిర్దయపు నీలితెరలు కరిగిపోయి
మనకు ప్రేమోదయం కలిగేది ఎప్పుడో!!
**************************************

కామెంట్‌లు