విద్యా సంవత్సరం ప్రారంభం నుండే గుణాత్మక విద్యాసాధనకై వ్యూహరచన చేస్తున్నామని, అందులో భాగంగా కనీస అభ్యసన స్థాయికి చేరుకోనట్టి విద్యార్థులకు అదనపు తరగతులను నిర్వహిస్తున్నామని కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు తెలిపారు.
మూడో తరగతి నుండి తొమ్మిదో తరగతి వరకు గల విద్యార్థులకు ప్రారంభ పరీక్షలు నిర్వహించామని అన్నారు. ఈ పరీక్షల ద్వారా తెలుగు, ఇంగ్లీషు, గణితం లందు ఏమేరకు విద్యా స్థాయి ఉందో ఒక నిర్ధారణకు వచ్చామని అన్నారు. తెలుగు ఇంగ్లీషులలో రాయడం చదవడం సామర్ధ్యాలను, గణితంలో చతుర్విధ ప్రక్రియల సామర్ధ్యాలను చేరుకోలేనట్టి 44మంది విద్యార్థులను గుర్తించామని ఆయన తెలిపారు.
వీరికి ప్రతీరోజూ సాయంత్రం అదనంగా గంట సేపు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తూ బోధిస్తున్నామని అన్నారు.
తెలుగు, ఆంగ్లం, గణితం ఉపాధ్యాయులు వల్లూరు లక్ష్మునాయుడు, ముదిల శంకరరావు, కింజరాపు నిర్మలాదేవి, పెయ్యల రాజశేఖరం, శివకల శ్రీవాణి, పడాల సునీల్, గేదెల వెంకట భాస్కరరావులు ఈ విద్యార్థులకు అదనపు సమయంలో కనీస అభ్యసన స్థాయి చేకూరేలా కృషి చేస్తున్నారని గొర్లె తిరుమలరావు తెలిపారు.
తనతో పాటు, తూతిక సురేష్, గుంటు చంద్రం, జన్ని చిన్నయ్య, కుదమ తిరుమలరావులు పర్యవేక్షణ గావిస్తున్నారని ఆయన అన్నారు. వీరితోపాటు విద్యాప్రమాణాలు మెరుగుపరిచే దిశగా ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, ఉపాధ్యాయులు దార జ్యోతి, బండారు గాయత్రి, బత్తుల వినీల, బోనెల కిరణ్ కుమార్, యందవ నరేంద్ర కుమార్, లు తగు తర్ఫీదు ఇస్తున్నారు. ఏరోజుకారోజు సంబంధిత నివేదికలను రబి కుమార్ మహాపాత్రో, సస్మితా పాఢి, సింగంశెట్టి మురళీకృష్ణలు రూపొందిస్తున్నారని ఆయన తెలిపారు. విద్యార్థులకు ఏయే అంశాలలో సందేహాలున్నాయో వాటి నివృత్తికి ఈ అదనపు సమయంలో అదనపు తరగతులు ఎంతగానో దోహదపడుతున్నాయని ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు అన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి