అరుంధతీ రాయ్ కి అవార్డు;- - యామిజాల జగదీశ్
 ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్ "2024  "పెన్ పింటర్" అవార్డుకి ఎంపికయ్యారు. వచ్చే అక్టోబర్ పదో తేదీన బ్రిటిష్ లైబ్రరీ సహకారంతో జరిగే కార్యక్రమంలో అరుంధతీ రాయ్ ఈ అవార్డును అందుకుంటారు. అలాగే ఆమె ప్రసంగం కూడా చేస్తారు.
ఆమెకు ఈ ఐవార్డు ప్రకటించిన జ్యూరీ తమ శక్తిమంతమైన స్వరాన్ని నిశ్శబ్దంగా ఉండనివ్వకండి అని సూచించింది.
ఆమె పేరుని అవార్డు కోసం ఎంపిక చేసిన కమిటీలో ఈ సంవత్సరం జ్యూరీలో ఇంగ్లీష్ పెన్ ప్రతినిధి రూత్ బోర్త్‌విక్, నటుడు ఖలీద్ అబ్దల్లా, రచయిత రోజర్ రాబిన్సన్ ఉన్నారు. 
అరుంధతీ రాయ్‌ ని అభినందిస్తూ, బోర్త్‌విక్,  అన్యాయానికి గురవుతున్న సంఘటనలు కేంద్ర బిందువుగా చేసుకుని ఆమె చేసే రచనలు అందరినీ ఆకట్టుకుంటాయన్నారు.
2024 పెన్ పింటర్ బహుమతికి ఎంపికైన  అరుంధతీ రాయ్‌కి అభినందనలు తెలిపారు. భారతదేశం ఒక ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించిందని, ఆమె ఆలోచనలు అసాధారణమని, ఆమె శక్తిమంతమైన స్వరం మౌనంగా ఉండకూడదని బోర్త్‌విక్ వ్యాఖ్యానించారు.
ఆమె పుస్తకాలు, ఆమె రచనలు, ఆమె జీవితం, స్ఫూర్తి, ఆమె తన మొదటి పుస్తకం, 'ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్' నుంచీ మన ప్రపంచం ఎదుర్కొంంటున్న అనేకానేక  సంక్షోభాలను కళ్ళకు కట్టినట్లు చెప్తున్నారని, ఆమె అక్షరం ఒక నక్షత్రమని జ్యురీ సభ్యుడు అబ్దల్లా ప్రశంసించారు.
1961 నవంబర్ 24న షిల్లాంగ్ (మేఘాలయ) లో జన్మించిన 
అరుంధతీ రాయ్ రాసిన " ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్" (1997) కి అవార్డుకూడా దక్కింది.

కామెంట్‌లు