మన్నెం వీరుడు అల్లూరికి ఘనంగా నివాళి

 మన్యం ప్రజలపై నిరంకుశ పాలన సాగిస్తున్న బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా విప్లవానికి పిలుపు నిచ్చిన అల్లూరి సీతారామరాజు త్యాగాలు భరతావనిలో చిరస్మరణీయమని కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు అన్నారు. 
అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన విశాఖపట్నం జిల్లా పాండ్రంగిలో 1897 జూలై 4 న జన్మించి, పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లులో విద్యాభ్యాసం గావించి, అడవి బిడ్డలపై బ్రిటిష్ వారి దుష్ట పెత్తనాన్ని నిరసిస్తూ, ఆ కొండ ప్రజల్లో చైతన్యాన్ని కలిగించిన ధన్యజీవి అల్లూరి సీతారామరాజు అని ఆయన అన్నారు. 
ఈనాటి సమావేశంలో సాంఘిక శాస్త్రోపాధ్యాయులు కుదమ తిరుమలరావు అల్లూరి సీతారామరాజు గూర్చి ప్రత్యేక గీతాన్ని ఆలపించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, ఉపాధ్యాయులు  దార జ్యోతి, పెయ్యల రాజశేఖరం, బండారు గాయత్రి, వల్లూరు లక్ష్మునాయుడు, శివకల శ్రీవాణి, బత్తుల వినీల, పడాల సునీల్, జన్ని చిన్నయ్య, కుదమ తిరుమలరావు, ముదిల శంకరరావు, కింజరాపు నిర్మలాదేవి, బోనెల కిరణ్ కుమార్, గేదెల వెంకట భాస్కరరావు, గుంటు చంద్రం, యందవ నరేంద్ర కుమార్, రబికుమార్ మహాపాత్రో, సస్మితా పాఢి, సింగంశెట్టి మురళీకృష్ణ తదితరులు పాల్గొని, స్వాతంత్ర్య సాధనకు కేవలం ఇరవై ఏడు సంవత్సరాల వయస్సు లోనే ప్రాణాలర్పించిన యోధుడు అల్లూరి అని, వారి దేశభక్తి అందరికీ ఆదర్శప్రాయమని ప్రసంగించారు. అనంతరం మిఠాయి పంచిపెట్టారు.
కామెంట్‌లు