కాయా పండా! ;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
పసరు పిందెయ
మిక్కిలి చిన్నది
ముచ్చట కొలిపేది
అందరిని అలరించేది

పచ్చబడిన పండు
తెంపినకాని తినటానికిపనికిరానిది
దొంగలు దగ్గరకురాకుండా
కోయకుండా కాపాడవలసినది

చిలక కొట్టినపండు
తయారయినదని
తీపితోనిండినదని
తంటాలుతెచ్చుకోకుతిని

ఎర్రగా పండినపండు
రంగు ఆకర్షిస్తుంది
నోరును ఊరిస్తుంది
తినమని తొందరపెడుతుంది

ఎక్కువగా మాగినపండు
రసముతోనిండినది
జుర్రుకోవలసినది
సంతసపరచగలది

రాలిపడిన పండు
ఈగలుదోమలు ముసిరినది
మట్టి అంటుకున్నది
కడుక్కొని తినవలసినది

ఫలాలప్రియా తేల్చుకో
పసిడిపిందెను కోరకు
పశువువు కాబోకు
పచ్చికాయను కాంక్షించకు
ఆవేశపరుడవని చాటకు
ఎంగిలిపండుకు ఆశపడకు
కక్కుర్తిపరుడనని ముద్రవేసుకోకు
పరిపక్వఫలమును వాంఛించు
ఆరగించి ఆనందించు


కామెంట్‌లు