బుద్ధుని మొదటి ప్రవచనం;- చిరసాని శైలూషి,నెల్లూరు.

 అందరూ విలాసాలలో కేరింతలు కొడుతూ ఆనంద డోలికల్లో వోలలాడుతున్నారు ఇది గమనించిన ఆ వేశ్య అందరి నగలు మూటగట్టుకుని పారిపోయింది విలువైన తమ నగలు వస్తువులు వెతుకుతున్న వారికి బుద్ధుడు కనిపించాడు ఇటుగా ఒక ఆవిడ వెళ్లిందా  ఆమె కోసం తాము వెతుకుతున్నాము అని బుద్ధుడిని అడిగారు ఆ యువకులు అప్పుడు బుద్ధుడు వారితో ఓ యువకుల్లారా పారిపోయిన ఒక స్త్రీని వెతకడం మంచిదా పోగొట్టుకున్న తమను తాము వెతుక్కోవడం మంచిదా చెప్పండి అని అన్నాడు  ఆ యువకుడు నిజం తెలుసుకున్న 30 మంది యువకుల సహనానికి సంతృప్తి చెందిన బుద్ధుడు యువకులారా అయితే కూర్చోండి మీకు ధర్మాన్ని బోధిస్తాను అన్నాడు బుద్ధుడు మంచిది అలాగే ధర్మాన్ని బోధించoడి అన్నారు వాళ్లు బుద్ధుడు బోధించగా శ్రద్ధగా ఆసక్తిగా ధర్మాన్ని ఆ యువకులకు ధర్మచక్షువులు ఉత్పన్నమైనాయి ధర్మాన్ని చూడగల కన్నులు తెరుచు కున్నాయి తర్వాత దీక్షను తీసుకున్న 30 మంది యువకులు బిక్షు  సమాజంలో చేరిపోయారు.ఆ 30 మంది యువకులకు దీక్షనిచ్చిన తర్వాత బుద్ధుడు ఉరువేల చేరుకున్నాడు ఉరివేలలో తల వెంట్రుకలు జడలు గట్టిన కశ్యపులనే ముగ్గురు బ్రాహ్మణ అన్నదమ్ములు ఉన్నారు ఉరువేల కశ్యపుడు నదీ కశ్యపుడనే ఆ ముగ్గురు సోదరుల వెంట్రుకలు జడలు గడ్డి ఉండటం వీటిని కశ్యపలు అని పిలిచేవారు గృహస్థ జీవితాన్ని విడిచిపెట్టి సన్యాసం స్వీకరించిన ఈ ముగ్గురు బ్రాహ్మణ సోదరులు  యజ్ఞ యాగాలను నిర్వహిస్తూనే ఉన్నారు ఉరువేల కశ్యపునికి 500 మంది నది కశ్యపుడు కి 300 మంది గయా కశ్యపునికి రెండు వందల మంది శిష్యులు ఉన్నారు అందరికంటే పెద్దవాడైన ఉరివేల కశ్యపుడు తా నెoతో ధార్మిక ప్రగతిని సాధించానని తాను అర్హంతుడననే భ్రమలో పడి దాన్లో నుంచి బయటకు రాలేకపోతున్నాడు.ఉరివేల కశ్యపని దగ్గరకొచ్చిన బుద్ధుడు ఆ రాత్రి అతని యాజ్ఞశాలలో విశ్రాంతి తీసుకోవాలి అని అనుకున్నాడు అందుకు కష్టపడి అనుమతించాడు ఆ సంగతి తెలిసిన ఉరివేల కశ్యపుడు బుద్ధుడు తనకంటే ధార్మిక శక్తి సంపన్నుడు అని గ్రహించి తన అతిథిగా ఉండమని కోరాడు ఉంరివేల కశ్యపను కోరికపై ఇష్టం లేకపోయినా బుద్ధుడు తన బుద్ధి శక్తులను ప్రదర్శించవలసి వచ్చింది ఎంత ప్రదర్శించినా అర్హoతనైనానన్న భ్రమ లో ఉన్న ఉరువేల కశ్యకుడు బుద్ధుని గొప్పతనాన్ని గ్రహించలేకపోయాడు తర్వాత భ్రమలో నుంచి బయటపడిన కశ్యపుడు సత్యాన్ని కనుకొని అనుభవ పూర్వకంగా సంబోధిని పొందిన బుద్ధుడు అరహంతుడే అని అంగీకరించారు తర్వాత బుద్ధుడు బోధించిన ధర్మాన్ని విన్న కశ్యపులు అతని 500 మంది శిష్యులతో కలిసి సంఘంలో చేరి ఉన్నత దీక్షను స్వీకరించాడు.
=====================================
సమన్వయం ; డా. నీలం స్వాతి 
కామెంట్‌లు