పొద్దున మనము లేద్దాము
చక్కగా తానం చేద్దాము
బుక్కెడు బువ్వ తిందాము
చక్కగా బడికి పోదాము
జాతీయ గీతం పాడుదాము
శ్రద్ధగా పాఠము విందాము
ప్రశ్నకు జవాబు చెప్పుదాము
వంద మార్కులు తెద్దాము
ప్రోగ్రెస్ కార్డు తెద్దాము
అమ్మా నాన్నకు చూపిద్దాము
భేశని వారితో అనిపిద్దాము
----------------------------------------
..జాధవ్ పుండలిక్ రావు పాటిల్,
భైంసా,నిర్మల్ జిల్లా,తెలంగాణ
సెల్ నెం 9441333315

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి