బుద్ధుని మహా పరి నిర్వాణం ;- చిరసాని శైలూషి, నెల్లూరు.
 పాటలీ గ్రామ వాసులు కూడా కాళ్లు కడుగుకొని తూర్పు గోడకానుకొని పశ్చిమ ముఖంగా బుద్ధుని చూస్తూ కూర్చున్నారు అప్పుడు వారిని ఉద్దేశించి గృహస్థులారా శీలం అలవర్చుకోని వాడు ఐదు రకాల ప్రమాదాల బారిన పడతారు నిర్లక్ష్యo వల్ల సంపదను కోల్పోతారు చెడ్డవాడుగా గుర్తింపు పొందుతారు ఏ పరిషత్తులో కలిసినా  అస్థిరత్వంలో ఉన్నవారు స్థైర్యం ని కోరుకుంటారు. ప్రపంచాన్ని అర్థం చేసుకోలేని అచేతనా స్థితిలో మరణిస్తారు మరణించిన తర్వాత మళ్ళీ పుట్టి తృప్తి లేని జీవితాన్ని గడుపుతారు అలా కాకుండా శీలవంతులైన గృహస్తులు జాగరూకతతో సంపదలను పొంది మంచి పేరు తెచ్చుకొని ఏ పరిషత్తులో పరిశీల ధైర్యాన్ని కోరుకొని  స్థిరత్వంతో ఉంటూ అన్ని  అవగతమై సంతృప్తితో మరణించి మరణించిన తర్వాత స్వర్గంలో హాయిగా జీవిస్తారు.ఇప్పటికే బాగా పొద్దుపోయింది ఇక మీరు విశ్రాంతి తీసుకోవచ్చు అన్న బుద్ధునికి నమస్కరించి సెలవు తీసుకున్నారు వారు, ఒక ఖాళీ గదిలోకి ప్రవేశించాడు బుద్ధుడు ఆ సమయంలో వజ్జీయులను ఎదుర్కొని దూరంగా తరిమి కొట్టడానికి వీలుగా అజాత శత్రువుని మంత్రులైన వస్సకారుడు సునీత పాటలీ గ్రామానికి దగ్గరగా కోట గోడలతో ఒక నగరాన్ని నిర్మిస్తున్నారు తెల్లవారుతుండగా బుద్ధుడు ఇక్కడ ఎవరో   నగరాన్ని నిర్మిస్తున్నాడు ఎవరు వారు అని ఆనందుని అడిగాడు మగధ మంత్రులైన సునీత వస్సకారులు ప్రభు అని బదులిచ్చాడు ఆనందుడు 33 స్వర్గ తయ తిoశ 33 మంది దేవతలు ఉండే స్వర్గం  ఆ సందర్భంలో అనేకమంది దేవతలు అక్కడ తిరుగాడుతున్న దృశ్యాన్ని వివరించాడు తర్వాత ఆర్యుల నివాసాలలో కల్లా అన్ని వర్తక కేంద్రాలలో కల్లా పాటలీ సిరి సంపదలతో కళ కళలాడే ఒక ముఖ్య నగరం అవుతుందని అయితే నిప్పు నీరు కొట్లాడుకోవడం అనే మూడు రకాల అపాయాల బారిన పడుతుందని చెప్పాడు బుద్ధుడు.మగధ మంత్రులైన వస్సకార సునీతలు బుద్ధుని వద్దకు వెళ్లి మరుసటి రోజు బిక్షకు ఆహ్వానించారు అంగీకరించిన బుద్ధుడు కాదనీయ భోజనీయాలను ఆరగించిన తర్వాత వారికి ఈ విధంగా ధర్మ ఉపదేశం చేశాడు వారు శీలవంతులైన వారి అవసరాలను తీర్చాలి చిత్త నియంత్రణతో జీవించే వారిని ఆదరించాలి గౌరవించాలి  ఎందుకంటే అలా చేసిన వారికి ఒకే బిడ్డ గల తల్లి ఆ బిడ్డ పట్ల ఎలా ప్రేమానురాగాలను కురిపిస్తుందో అలాగే జ్ఞానులు దేవతలు కూడా తగిన ఫలాన్ని అందిస్తారు అని బోధించిన తర్వాత బుద్ధుడు ఆసనం మీద నుంచి లేచి వెళ్ళిపోతూ ఉండగా సునీత వస్సకారులు బుద్ధుడు దాటిన  ద్వారాన్ని  గౌతమ ద్వారమని దాటబోయే గంగా నదినిగౌతమనది అని పిలవాలనుకుంటారు.
=================================
సమన్వయం ; డా. నీలం స్వాతి 

కామెంట్‌లు