ఉడతతో ఉత్తరం ;- ఎడ్ల లక్ష్మి
ఊయల ఊగే పాపాయి 
ఉడుత పిల్లను చూసావా 
ఉలిక్కిపడి లేచావా 
ఉమను రమను పిలిచావా

ఊరు వాడ దాటారు 
ఉల్లి తోటలోకి వచ్చారు 
ఊసులెన్నో చెప్పారు 
ఉదయించే రవిని చూశారు 

ఉలుకు పలుకు లేకుండా
ఉత్తరమొకటి రాశారు 
ఉరుముల ఊయల ఎక్కారు 
మెరుపుల వెలుగులో నడిచారు 

ఉడతను చేరవచ్చారు 
ఉడతకు ఉత్తరం ఇచ్చారు 
ఊరిలోకి పంపారు 
హాయిగా పాపతో ఆడారు 


కామెంట్‌లు