జిపిఎస్ రాజపత్రంపై యుటిఎఫ్ ఖండన.

 సిపిఎస్ రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నదే ఉద్యోగు ఉపాధ్యాయుల ఆకాంక్ష అని ఇంకే ఇతర విధానాలనీ అంగీకరించలేదని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి మోహనరావు అన్నారు. ఇందుకు విరుద్ధంగా గత ప్రభుత్వం జిపిఎస్ అమలు చేస్తానని చెప్పిననూ, తమ పోరాటాలు ఫలితంగా తాత్కాలికంగా జీవోను విడుదల చేయలేదని గుర్తుచేసారు. 
కానీ, నేటి నూతన ప్రభుత్వం ఇప్పుడు పాత తేదీతో జిపిఎస్ విధానాన్ని అమలుచేస్తూ రాజపత్రాన్ని విడుదల చేయటం మహా దుర్మార్గమని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి మోహనరావు ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. నిన్న 
12వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం తామంతా వ్యతిరేకిస్తున్న జి.పి.ఎస్.విధానాన్ని అమలు చేయాలని జి.ఓ.నెంబర్ 54 రూపంలో రాజపత్రం విడుదల చేయడం పట్ల తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు రాజాం డివిజన్ యూటీఫ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మోహనరావు మాట్లాడుతూ, గత ఏడాది అక్టోబర్ నుంచి సిపిఎస్ ఉద్యోగులందరినీ జిపిఎస్ లోకి తీసుకువస్తూ రాజపత్రాన్ని ఇప్పుడు విడుదల చేయడమేమిటని ఆయన ఆక్షేపించారు. ఈ జి.ఓ.ని విడుదల చేసిన ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులను కచ్చితంగా మోసగించడమేననీ ఆయన అన్నారు. విడుదల చేసిన ఈ రాజపత్రాన్ని తక్షణమే రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడానికి కోసం సత్వర చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసారు. 2017లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో 57 ని తక్షణం అమలు చేసి, 2003 డిఎస్సీ ద్వారా నియామకం పొందిన ఉపాధ్యాయులందరినీ తిరిగి పాత పెన్షన్ లోకి పునరుద్ధరించడానికి కూడా చర్యలు తీసుకోవాలని మోహనరావు డిమాండ్ చేసారు. 
అనంతరం 54వ నెంబర్ జీ.ఓ.కాపీలను దగ్దం చేసి నిరసన తెలియజేసారు. ఈ కార్యక్రమంలో యుటీఫ్ జిల్లా కార్యదర్శి బి.రామినాయుడు, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు ఎం.కృష్ణమూర్తి, యుటిఎఫ్ రాజాం మండలశాఖ అధ్యక్షులు ఎం.రమేష్, ప్రధాన కార్యదర్శి బి.నాగేశ్వరరావు, వంగర మండలశాఖ అధ్యక్షులు ఎం.ప్రసాద్, కె.శ్రీనివాసరావు, 
ఆర్.గణపతిరావు, జి.సింహాచలం, బి.రమేష్, వి.ప్రవీణ్ కుమార్, ఎం.వి.నాయుడు, పి.బాలకృష్ణ, ఎం.శ్రీరాములు, పి.మురళి తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు