కనుకధారాస్త్రోత్రం;- కొప్పరపు తాయారు!
🌟శ్రీ శంకరాచార్య విరచిత🌟 

శ్లో!! సంపత్కరాణి సకలేంద్రియ నంద నాని 
సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షీ  !
త్వద్ వందనాని దురితా హరిణోద్యతాని
మామేవమాత రినిశం కలయంతుమాన్యే !

భావం: దేవతలందరిలోనూ మాన్యురాలవైన ఓ మహాలక్ష్మి! మేము నీకు చేయు వందనములు 
మాకు సంపదలను కలిగించినవి. మాకు సమస్త ఇంద్రియములను సుఖ పెట్టునవి‌ అవి రాజాధిరాజత్వమును సైతము ప్రసాదింప జాలినవి పాపములను పోకార్చుటకు సదా సన్నద్ధమైనట్టి వి. అవి నన్ను ఎల్లప్పుడూ (పసి బిడ్డ వలె) పట్టుకుని యుండు గాక
                   ****


కామెంట్‌లు