🪷కనుకధారాస్త్రోత్రం;- కొప్పరపు తాయారు.
🌟శ్రీ శంకరాచార్య విరచిత🌟 

శ్లో!! నమోస్తు కాంత్యై  కమలేక్షణాయై
       నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై !
       నమోస్తు దేవాది భిరర్చితాయై 
        నమోస్తు నందాత్మజ వల్లభాయ్ !

భావం: కమలముల వంటి కన్నులు గల కాంతి స్వరూపరాలికి నమస్కారము. ప్రపంచంలో కన్నతల్లి అగు అష్టసిద్ధి స్వరూపురాలికి వందనము. దేవ, దానవ, మనుష్యాధులచే, పూజింపబడు లోకైక శరణురాలికి ప్రణామము. నంద కుమారుడైన శ్రీకృష్ణ పరమాత్మ కి
చెలికత్తెయగు శ్రీదేవికి దండములు.
విశేషార్థము: ఇచ్చట కమలముల వంటి కన్నులు 
అనగా కమలముల వలె అందమైన కన్నులు అని లోకాన బోధము. పూర్వ వ్యాఖ్యాతలు అందరూ అట్లే వ్యాఖ్యానించి ఉన్నారు కానీ నిజమైన అర్థము వేరు. దేవతల కన్నులు మనుషుల కన్నుల వలె తెల్లగా కాక కమలముల వలె ఎర్రగా నుండును. 
                      ***


కామెంట్‌లు