సుప్రభాత కవిత ; -బృంద
నడిచే దారిలో విరిసే పువ్వులు
మురిసే మనసుల మెదిలే నవ్వులు

తెలియని జీవన గమ్యం
ఆగని బ్రతుకుల గమనం

ఏవో మమతల పిలుపులు
ఎదో మనసుల కలయికలు

ఎన్నో తీయని తలపులు
ఎంతో కమ్మని స్నేహాలు

ఎక్కడో  కలిసిన భావాలు
ఎపుడో  తెలిసిన ఆనవాళ్ళు

కలతలతో పాటు కథలు
వేడుకతో పాటు వెతలు

దగ్గరైన మనసు బంధాలు
దూరమైనా విడని పాశాలు

కలనేతగ అల్లుకున్న
కల నిజాల దుప్పట్లు

కావాలనుకున్నవి కొన్నైతే
కావాలని వచ్చినవి కొన్ని

అనుబంధాలు అభిమానాలు
ఆవేశాలు అలకలతో 

మనమే కట్టుకున్న
మనసనే గుజ్జనగూళ్ళు

ఆనందమైనా మనదే
ఆక్రందనైనా మనదే

ఒంటరైన బ్రతుకుబాటలో
వెంట వచ్చే అనుభూతులు

గతమైన నిన్నటి వివరాలు
మితమైన నేటి సమయాలు

సంతోషాలు పోగు చేసుకుని
సంబరంగా గడపాలని

సందేశం తెచ్చే సరికొత్త వేకువకు

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు