వీడ్కోలు!!!;- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని.
 ప్రతి ఉపాధ్యాయుడు 
ఒక సూర్యుడే ఒక చంద్రుడే!!

ఉపాధ్యాయునికి 
వీడ్కోలు ఉండదు.!!
సూర్యచంద్రులకు 
వీడ్కోలుండదు......!!!

అస్తమించిన రేపు మళ్లీ ఉదయిస్తారు.!!!!!!!!!!!?

విద్యార్థులారా!!

ఆకాశంలో నక్షత్రాలు మీరు 
ఆకాశంలో ఎగిరే పక్షులు మీరు 
పొలంలో విత్తిన విత్తులు మీరు 
నదుల్లో పారే నీరు మీరు 
మైదానాల్లో మహా వృక్షాలు మీరు!!

ఎత్తయిన పర్వతాల్లా
ఎదగాలి మీరు. 
లోతైన సముద్రాల్లా
ఒదిగి ఉండాలి మీరు!!!

ప్రతి పాఠము ఒక జీవిత పాట కావాలి. 
ప్రతి ఆట నీటి అలా కావాలి 
మీ ప్రతికలా నిజం కావాలి. 

అక్షరాలే నీకు లక్ష్యం 
అక్షరాలే నీకు సాక్ష్యం 
అక్షరాలే నీ లక్షల సంపాదన!!!

ప్రతి ఉపాధ్యాయుడు 
ఒక సూర్యుడే ఒక చంద్రుడే 
ఉపాధ్యాయునికి వీడ్కోలు ఉండదు 
సూర్యచంద్రులకు వీడ్కోలు ఉండదు 
అస్తమించినా రేపు మళ్లీ ఉదయిస్తారు.!!!!!!!!!!!!!!!!!!!!!!!?

బదిలీ అయినా నంది వడ్డెమాన్ జిపిఎస్ ఉపాధ్యాయుల వీడ్కోలు సందర్భంగా.


కామెంట్‌లు