కాలం గాలానికి చిక్కకున్న
మన పయనం ఎటువైపు?
కాలం విలువైంది
పదండి ముందుకు పదండి తోసుకు
అన్నారు కొందరు
నిదానమే ప్రధానం
అన్నారు మరికొందరు
కాలం కఠిన చిత్త
తనచిత్తం వచ్చినట్టే చేస్తుంది
కాలం మాయ దారిది
మన దారి మళ్ళిస్తుంది
కాలానికి కట్టుబడనివారెవరూ లేరు
కాలం భయంకర దంష్ట్రలకు
బలికాని వారెవరూ లేరు
కాలం కొందరిని భుజాలకెత్తుకుంటుంది
పేదను రాజును చేసి
కాలం మరికొందరిని నేలకేసి కొడుతుంది
రాజను పేదను చేసే
కాలానికి తరతమ భేదాల్లేవు
కాలం అత్యంత బలశాలి
నాగరికతలను నామరూపాల్లేకుండా
సముద్రాలను ఇగిరిపోయేట్లుగా
నదుల దారి మళ్ళేట్లుగా
జీవజాలాన్ని అంతరించేట్లుగా
నూతన ఆవిష్కరణలను సంభవించేట్లుగా
అబ్బో!
కాలం మాయాజాలం
ఎవరికీ అర్థం కాదు
కాలం ఎన్నో సమస్యలను
కొనితెస్తుంది
అంతేకాదు
కాలం ఎన్నో సమస్యలకు
పరిష్కారం చూపుతుంది
కాలం ఆడించే ఆటలో
మనమంతా తోలుబొమ్మలం!!
**************************************
తోలుబొమ్మలు;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
• T. VEDANTA SURY

అభినందనలు!ఏక బిగిన చదివించిన కవిత ఇది!
వైవిధ్యమైన శైలికి,మీకు మీరే సాటి!
అభినందనలు!ఏక బిగిన చదివించిన కవిత ఇది!
వైవిధ్యమైన శైలికి,మీకు మీరే సాటి!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి