భగవద్గీత మహత్యం;-సి.హెచ్.ప్రతాప్

 భగవద్గీత అంటే “పరమాత్మ యొక్క గానం,” మనిషికి మరియు అతని సృష్టికర్తకు మధ్య సత్య-సాక్షాత్కారానికి సంబంధించిన దివ్య-సంయోగం, ఆత్మ ద్వారా పరమాత్మ యొక్క బోధలను ఎడతెగకుండా మననం చేయదం మనందరి కర్తవ్యం.విశ్వం యొక్క జ్ఞానమంతా గీతలో నిండి ఉంది. అత్యంత గాఢమైనది, అయినప్పటికీ ఓదార్పునిచ్చే సరళతతో కూడిన అందమైన ద్యోతక భాషలో ఉండే గీతను, మానవ ప్రయత్నాలు మరియు ఆధ్యాత్మిక పోరాటాల యొక్క అన్ని స్థాయిల్లోను ఆకళింపు చేసుకొని, అన్వయించబడింది.భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాటలు యోగ శాస్త్రానికి సంబంధించిన ఓక లోతైన గ్రంథం, భగవంతునితో ఐక్యత మరియు దైనందిన జీవనానికి ఒక పాఠ్య పుస్తకం. విద్యార్థి అర్జునుడితో కలిసి అంచెలంచెలుగా ఆధ్యాత్మిక సందేహం మరియు బలహీన హృదయం యొక్క మర్త్య చైతన్యం నుండి దివ్య-అనుసంధానం మరియు అంతరంగ-నిశ్చయము వైపు నడిపించబడతాడు.ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో శుక్ల పక్షంలో శుద్ధ ఏకాదశి తిథి నాడు గీతా జయంతిని జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజే పవిత్ర గ్రంథమైన భగవద్గీత ఆవిర్భవించిందని పురాణాలలో పేర్కొనబడింది. ఇందులో 700 శ్లోకాలున్నాయి. మానవాళికి ఉపయుక్తమైన ఎన్నో విలువైన సందేశాలు భగవద్గీతలో పొందుపరచబడ్దాయని వేదవేత్తల అభిప్రాయం.భగవద్గీతలో శ్రీ కృష్ణుడు ప్రకారం, భగవంతుడు ఎవరి తలరాతను ముందుగానే రాయడు. ఎవరైనా సరే తమ విధి, తమ ఆలోచనలు, స్వభావం, చర్యలను బట్టే నుదుటి రాత నిర్ణయించబడుతుంది. అందుకే ఎవరైనా సరే తమ జీవితంలో మంచి పనులు చేయాలని శ్రీ కృష్ణుడు సూచించాడు. మన శరీరం శాశ్వతం కాదని శ్రీ క్రిష్ణుడు భగవద్గీతలో స్పష్టంగా వివరించారు. మన శరీరం పంచభూతాలకు సంబంధించినది. అది వాటిలోనే కలిసిపోతుంది కానీ ఆత్మ స్థిరంగా ఉంటుంది. అందుకే ఓ మనిషి! నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకో. నీ జీవితాన్ని ముగించేందుకు ఇదొక ఉత్తమ మార్గం. ఇలా బతికేందుకు ప్రయత్నించిన వారు భయం, దుఃఖం, సమస్యల నుంచి శాశ్వతంగా విముక్తి పొందుతారు. 
కామెంట్‌లు