నీవొచ్చే దారిలోపువ్వుల నవ్వులెందుకో!నిను చూసిన సంబరానకొమ్మల ఊయల ఊగెనందుకే!నీ రాక తో నీలాల నింగిరంగులు మార్చెనెందుకో?బంగరుకాంతులు నిండినవెలుగుల తడిసేనందుకే!నీ రాకను చెప్పాలనితూరుపు కొండల తొందరెందుకో?చేతుల మధ్య నిన్నెత్తుకునిజగతికి చూపేనందుకే!నిన్ను చూసిన సంబరానగువ్వల మందల కువకువలేమిటో?నీవు వస్తున్న కబురు జగతికిచేరవేసే తొందర అందుకే!నిదరోయిన అడవి మేలుకునినిగనిగమెరిసేనెందుకో?వెలుగురేఖలు నిలువునాతాకి క్షేమ మడిగేనందుకేమో!ప్రత్యూష సమయానప్రభవించు సోయగాలుపరికించు మనసులకేప్రత్యేక అనుభూతులు!రమణీయమైన వేకువకు🌸🌸 సుప్రభాతం🌸🌸
సుప్రభాత కవిత; -బృంద
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి