సాలీడు గూడును ఒకేసారి అల్లినట్లు
కాలం కూడా మన చుట్టూ ఒకేసారి అల్లుకుంటుంది.!!
ఎత్తు పల్లాలు ఎండమావుల్లా కాదు
భూత భవిష్యత్ వర్తమాన కాలాలవీ
కోడి పిల్లను ఎగిరేసుకుపోయిన గద్దనేమడుగుతావు.
చేప పిల్లను నోటా కర్చుకున్న కొంగనేమడుగుతావు.!!?
వలల్లా చుట్టూ అల్లుకున్న కళ్ళు అవి
మెల్లిమెల్లిగా వలల్లా దిగుసుకుంటున్న వాటి కాళ్లు అవి
ఎంతుంటేనేమీ ఆహారం దాచుకునే చీమ తప్ప
ఏనుగు పులి ఎప్పుడు ఆకలితోనే ఉంటుంది.!!
ఆకాశం నెలకు దించిన ఊడలు నిచ్చెనలని బ్రమపడితే
సముద్రంలో పడిపోతాం.!?
ఆకలిగొని సిద్ధంగా ఉంటే పళ్ళన్నీ పంచి చిల్లర గవ్వలు ఇచ్చే చెట్టు ఉంటేనేమీ లేకుంటేనేమీ!!
స్మశానానికి రాత్రి అర్ధరాత్రి ఉండదు. పగలు పట్టపగలు ఉండదు.
అదో అద్భుతం భూతం అదో జలాశయం ఓ జీర్ణాశయం.!!?
నిర్ణయాలు నీవి కర్మలు నీవి పుడితే గడ్డి పూల పుట్టు
ఒక రోజులోనే ఒక జన్మలోనే గిట్టు!!!
తాబేలు లా బ్రతికే శతాబ్దాల యుద్ధాలు వద్దు. ఇది ప్రతి ఫుటకో మాట!!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి