శ్రీ విష్ణు సహస్రనామాలు ;- (బాల పంచపది ఎం. వి. ఉమాదేవి
966)జన్మమృత్యు జరాతిగః -
=====================
పుట్టుక, జీవనము లేనివాడు 
వృద్ధి, మార్పులు లేనట్టివాడు 
కృశించుట జరుగనట్టివాడు 
నాశనము యెరుగనట్టి వాడు 
శ్రీ విష్ణుసహస్ర నామాలు ఉమా!
967)భూర్భువః స్వస్థరుః -

భూమిలో అధికారమున్నవాడు 
ప్రాణులకు స్వస్థతనిచ్చువాడు 
భువనములను పోషించువాడు 
భూర్భువ... నామధేయమున్నవాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
968)తారః -

సంసారమును దాటించువాడు 
జీవితకడలి గట్టేక్కించువాడు 
తరింపజేయుచున్నట్టి వాడు 
తారః నామము గలిగినవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
969)సవితా -

తండ్రివలే రక్షణనిచ్చువాడు 
పితృసమానము అయినట్టివాడు 
భక్తులనాదరించేటి వాడు 
సవితా నామధేయం గలవాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
970)ప్రపితామహః -

బ్రహ్మదేవునికి తండ్రియైనవాడు 
తాతగారి స్థానములో నున్నవాడు 
భక్తవత్సలుడు అయినట్టివాడు 
ప్రపితామహుడై యున్నవాడు 
శ్రీ విష్ణుసహస్ర నామాలు ఉమా!

(సశేషము )

కామెంట్‌లు