మన తప్పులతో సహా
మనని స్వీకరించేవాళ్ళు
మన కన్నీళ్ళకు
స్పందించే వాళ్ళు
మన మీద నమ్మకం వుంచేవాళ్ళు
మనకు ధైర్యం చెప్పి
గౌరవమిచ్చేవాళ్ళు
మన ఆలోచనలను
సరైన పంథాలో నడిపించేవాళ్ళు
అలాంటి మిత్రుల సమక్షంలోనే
మనం ఆహ్లాదంగా వుండగలం!!
**************************************
ఆహ్లాదం;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి