భారత రక్షక దళం
సంయుక్త దళాలు
సర్వవేళలా రక్షణే
ధ్యేయం.సర్వం దేశమే
భరతమాత ముద్దుబిడ్డలు
భారతీయతకు ప్రతిరూపాలు
భారమంతా తమదనే వారు
వారి ధ్యేయం అందరి రక్షణ
దేశ భవిష్యత్తు దేశ స్వేచ్ఛ
దేశ ప్రగతి,దేశ గొప్పతనం చాటు
అహర్నిశలు, ప్రాణాలను పణంపెట్టి
తన,మన,లేక రక్షణే నా ఊపిరి
దేశ బాగోగులు లే నాక్షేమం
అన్న త్యాగ నిరతి తో తనదనేది
నిర్దాక్షిణ్యంగా వదిలి, వెనక్కి
తిరిగి చూడక,పాటుపడే ప్రతి
సైనికుడు అభినందనీయడే
ఆదరణీయుడే,దైవ స్వరూపమే
చిరునవ్వుతో చివరివరకూ
రణం లో అతిభయంకర
క్షణాలలో ఆలోచించక
పోరాడే ధీరుడు, వీరుడు
మన సైనికుడు,మరువలేము
మీ వీరోచిత గాథలు దివ్యము
పురుషార్థము,మనసు పండు
కనులు నిండు, దేశం కోసమే
జన్మించిన వీరచరితలారా
మాతా పితరులకు తలమానికాలు
దేశానికి వజ్రవైఢూర్యాలు !!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి