వైవిధ్యం;- సాయి వేమన్ దొంతి రెడ్డి,-కుంచన పల్లి.
 భారతదేశానికే కాదు ప్రపంచ ప్రజానీకానికి  తలమానికమైన  భగవద్గీతను ఏడవ శతాబ్దంలో  శంకరాచార్యుల వారు  రచించారు  దానిలో ఒక విషయాన్ని గురించి ఆయన చెబుతూ  స్నేహితులు గాని బంధువులు కానీ వచ్చినప్పుడు వారితో మాట్లాడేటప్పుడు ఎంతో ప్రేమతో మాట్లాడడం మన అలవాటు  అయితే శంకరులు వారు చెప్పేది  మనం మాట్లాడే మాటల్లో ప్రేమ ఉండడమే కాదు మనసులో కూడా ఆ ప్రేమ నిక్షిప్తమై ఉండాలి  అది శాశ్వత ప్రేమ అనిపించుకుంటుంది అంటారు  కోపాన్ని గురించి చెబుతూ కోపం మనసులో దాచుకోకూడదు అది శత్రువు లాగా మనల్ని నాశనం చేస్తుంది  నిజమైన కోపం వస్తే దానిని తగ్గించుకోవడానికి వెంటనే  మాటలలో మాత్రమే వ్యక్తం చేయాలి తప్ప  మనసులో ఉంచుకోకూడదు   అంటారు ఆయన.మన దగ్గర ఏది ఉంటే దానిని సమాజంలో ఎవరికి ఉపయోగపడుతుందో వారికి వినియోగించడం  సరైన పద్ధతి  విద్యార్థి చదువుతున్నప్పుడు  ఆ విద్యలో ఉన్న మూల సూత్రాలను మీ స్నేహితులకు బంధువులకు  నేర్చుకోవాలన్న కుతూహలం కలిగిన వారికి చెప్పాలి  నీకు మించిన ధనం నీ దగ్గరే ఉంటే ఎవరికి అది ఉపయోగపడుతూ ఉంటుందో దానిని అర్థం చేసుకొని  దానికి సరిపడిన దానం ఇస్తూ ఉండాలి  మనకి ఏదైనా మంచి హోదా ఉంటే నలుగురికి జీవన ఉపాధిని కల్పించడానికి ప్రయత్నం చేయాలి  మంచి పరపతి గనక మనకు ఉంటే అది నలుగురికి మాట సాయం ద్వారా  సహకరించేదిగా ఉండాలి  ఇవేమీ లేకుంటే కనీసం నలుగురికి మంచిని గురించి చెప్పు లేకుంటే మౌనంగా ఉండు అంతేగాని  ఎవరికి అపకారం కీడు చేయడానికి ప్రయత్నించవద్దు అని మన మునులు చెప్పిన విషయం.విష్ణుమూర్తికి మనదేశంలో నాలుగు దిక్కుల నాలుగు విశ్రాంతి మందిరాలు ఉన్నాయి  వీటినే మన పెద్దవారు చార్ధామ్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు  ఇందులో ప్రత్యేకించి రామేశ్వరంలో ఆయన స్నానం చేస్తాడు అని ప్రతీతి  ఆ తర్వాత ద్వారకకు వెళ్లి అక్కడ  తన కార్యక్రమాలు ప్రారంభించడానికి సిద్ధం అవుతాడు  అక్కడ నుంచి పూరి వెళ్లి అక్కడ భోజనం ఏర్పాటు చేసుకుంటాడు  ఆ తర్వాత బదరీనాథ్ లో ధ్యానం చేస్తాడు  కనుక ఊరిలో మహా ప్రసాదం అనే సంప్రదాయం ఉంది  దీనికి విపరీతమైన ప్రాముఖ్యం ఏర్పడింది అక్కడ ఆయనకు  సమర్పించిన 56 వంటకాలు భక్తులు చక్కగా  రుచి చూచే సౌలభ్యం ఉంది  మరి ఇవి చేసేది మామూలు మనిషి కాదు అని పూరి స్వాముల అభిప్రాయం  అయితే ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం చెబుతూ కేవలం మహాలక్ష్మి మాత్రమే చేస్తుంది అని వారు సమాధానం చెప్తారు.
==============================
సమన్వయం ; డా . నీలం స్వాతి 

కామెంట్‌లు