తెలివి తేట లెన్ని యున్నను గాని,గురువువద్దవిద్యేగుణము బెంచు...!
గురువు లేని విద్య గుడ్డివిద్య వునహో...
భ్రమ, ప్రమాదముల బడద్రోయు విద్యార్ధిని...!
దోష రహిత విద్య గరపగల
చతురత...
గురువుదక్క వేరెవరి వశము
జ్ఞాన బోధ చేసి సన్మార్గమును
జూపు గురువు దైవమె కదా...
వినయ, విధేయతల ప్రణతు లిడుదము భక్తి తోడ ...!
******
....గురువు;- .. కోరాడ నరసింహా రావు!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి