తర్వాత ఒక శవాన్ని నలుగురు మోసుకు వెళుతున్న దృశ్యాన్ని చూసి అదేమిటని అడిగిన సిద్ధార్థనితో చెన్నుడు పుట్టిన ప్రతివారు మరణించవలసినదే అన్నాడు. అన్ని వదిలేసి ప్రశాంత వదనంతో వీధిలో తిరుగుతున్న ఒక సన్యాసి కనిపించాడు మొదట మూడు దృశ్యాలు చూసిన సిద్ధార్థునికి తప్పించుకోవడానికి వీలు లేని మనుషుల దురవస్థలను దుఃఖమయమైన జీవితాన్ని తలపిoపచేశాయి సన్యాసిలా శాంతియుతమైన జీవనం కోసం అన్నిటితో పాటు ఇంటిని కూడా వదిలిపెట్టి బయటికి వెళ్ళడం మేలు అనిపించింది బాగా ఆలోచనలో పడిన సిద్ధార్థునికి ఈ ప్రపంచం దుఃఖమయమైందని ఇంద్రియ సుఖాల్లోనూ భోగాల్లోనూ సారం లేదని ఈ దుఃఖంలో నుంచి బయట పడాలంటే సంసారి జీవితాన్ని చేయవలసిందిగా అనిపించింది అంతే.ఇక ఇంటిని వదిలి బయటకు వెళ్లడానికి నిశ్చయించుకున్నాడు సరిగ్గా అప్పుడే తనకు కొడుకు పుట్టాడు అన్న వార్త వినటంతో తనకు ఒక రాహువు ప్రతిబంధకం పుట్టింది అనుకున్నాడు గుణవతి అయిన భార్య యశోదర ముక్కుపచ్చలారని పసిబిడ్డ రాహులుడు సిద్ధార్థుని సంకల్పానికి అడ్డు రాలేదు నిజాన్ని తెలుసుకోవడానికి ఇంటిని వదిలి పెట్టాలి అనుకున్నాడు అప్పుడు సిద్ధార్థుని వయసు సరిగ్గా 29 సంవత్సరాలు రథసారథి చెన్నుడు కీ తన గుర్రమైన కంఠకాన్ని శబ్దం చేయమని చెప్పాడు నిద్రిస్తున్న భార్య యశోదరను కొడుకు రాహుల్ ని సిద్ధార్థ ని ఒకసారి రాగరహితంగా చూసి ఇంటిని వదిలిపెట్టాడు దీనినే సిద్ధార్థుని మహాభి నిష్క్రమణం అంటారు.కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత అనోమా నది ఒడ్డుకు చేరుకొని జుట్టును గడ్డాన్ని తొలగించుకున్నాడు తన నగల్ని దుస్తుల్ని చెన్నుడుకి వాటిని రాజప్రాసాదానికి తీసుకొని వెళ్లమని ఇచ్చాడు పరీత్యాగానికి గుర్తుగా కాషాయ వస్త్రాలను ధరించి భిక్షతో జీవించటం మొదలుపెట్టాడు వంటిని కప్పుకోవడానికి ఒక బట్ట భిక్ష ను అందుకోవడానికి ఒక పాత్ర తప్ప తన వద్ద ఏమి లేని సిద్ధార్థులు చెట్ల కింద నివసిస్తూ సత్యాన్వేషణ మొదలు పెట్టాడు అలా సత్యాన్ని అన్వేషిస్తూ ఆ చోట ఈ చోట అనకుండా తిరుగుతూ అలారకాలా ముడు ఒక ముని వద్దకు చేరుకున్నాడు తర్వాత కాలాముడి తో తాను కొంతకాలం పాటు పవిత్ర జీవితం గడపాలని అనుకుంటున్నానని చెప్పగా అందుకు అంగీకరించిన కాలాముడు మీరు మాతో ఉండొచ్చు మా బోధనలు మీరు తేలిగ్గానే అర్థం చేసుకొని సాధన కూడా చేయగలరు అని చెప్పాడు.
==========================
సమన్వయం ; డా. నీలం స్వాతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి