కళ్ళెము లేని గుర్రము ;- ఎడ్ల లక్ష్మి
కళ్ళెం లేని గుర్రము 
ఇల్లల్లోకి వచ్చింది 
చెనగల రాసి చూసింది 
చల్లాచెదురు చేసింది 

చెన్నయ్య తాత వచ్చాడు 
చిన్నగా దాన్ని చూశాడు 
మెల్లగా కళ్లెం వేసాడు 
గుర్రం మీదా ఎక్కాడు

చేతిలో బరిగే పట్టాడు 
చుర్రున దాన్ని కొట్టాడు
నాలుగు కాళ్లు లేపింది 
నాలుగు ఇండ్లు దాటింది 

దుమ్ము లేపుతూ ఆ గుర్రం 
గాయి గాయి చేసింది 
పరుగులు తీసి ఉరికింది
రాయిఫోల్ కు  చేరింది  


కామెంట్‌లు