వైవిధ్యం;- సాయి వేమన్ దొంతి రెడ్డి,కుంచన పల్లి.
 ఉదయమే తులసి మాతను  ధ్యానించి  తులసి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షణలు చేసి నమస్కరించి  రెండు ఆకులు తుంచి  నమిలి తిన్నట్లయితే  శరీరంలో ఉన్న అనేక  జబ్బులను నయం చేయడానికి ఉపయోగపడుతుంది  భక్తి పారవశ్యంతో చేసేవారికి భగవత్ స్వరూపం కనిపిస్తుంది  అలాంటి తులసి ఆకుల్ని నీడలో ఎండబెట్టి తర్వాత బాగా దంచి చూర్ణం చేసి ముందు జల్లెడ పట్టి ఆ తర్వాత వస్త్రకలితం చేయాలి అంటే పలుచని గుడ్డలో వేసి మెత్తటి చూర్ణం కిందికి దిగేలా చేతితో కలపాలి ఆ చూర్ణంన్ని కొద్ది కొద్దిగా నస్యం లాగా పీల్చుకుంటే ముక్కుకు సంబంధించిన  సైనసైటిస్ ఊపిరి ఆడక పోవడం తుమ్ములు చిటికలోనే మటుమాయం అయిపోతాయి  కనుక నిత్యం  తులసి ఆకులను తినడం ఈ పొడితో  వేడి నీళ్లు కలుపుకొని తాగడం అలవాటు చేసుకోండి.జీవితాన్ని మూడు భాగాలుగా విభజించవచ్చు  మొదటిది బాల్యం ఆ తర్వాత యవ్వనం చివరికి వృద్ధాప్యం  బాల్యంలో తనకు ఏదీ తెలియదు  ముందు పాకటం నేర్చుకొని ఆ తర్వాత నడవడం కోసం ఎన్నో తప్పటడుగులు వేస్తూ ఉంటాడు  అలా అడుగులు వేయగా వేయగా నడక అలవాటు అవుతుంది  కొంచెం పెరిగిన తర్వాత యవ్వనంలోకి వస్తాడు  తన జీవితంలో కోరిన కోరికలు ఏవి పూర్తి సంతృప్తిని ఇవ్వవు  వాటిని ఎంత సొంతం చేసుకున్నా ఇంకా స్వాధీనం చేసుకోవాలన్న అభిప్రాయంతోనే ఉంటారు  ధనం కాని స్త్రీ సాంగత్యం కానీ ఏదైనా కావచ్చు  అలాగే చివర తప్పించుకోలేనిది జీవితంలో వృద్ధాప్యం  చిన్నతనంలో పసిపాప ఎలా బాల్యాన్ని గడిపాడో ఆ స్థితికి వచ్చేస్తాడు  ఇది జీవిత   వృత్తం  ఎవరు తప్పించుకోలేనిదే  ఈ మూటిని కలిపితేనే మనం జీవితం అంటాం.జీవితం మూడు విధాలుగా ఉంటుంది  మొదటిది గడిచి పోయినది  రెండవది గడుస్తున్నది మూడవది రాబోయేది  గతం ప్రస్తుతం ఇవి మన కోసం ఆగవు ఇవాళ నిన్నటి గురించి ఆలోచించి ఏం తప్పులు చేశామా  అని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే  ఆ తప్పు తప్పుగానే మిగిలిపోతుంది  గతాన్ని  భవిష్యత్తులో కి మనం తీసుకురాలేం  అలాగే రేపు ఇది చేయాలి అది చేయాలని ఎన్నో  ప్రణాళిక లను సిద్ధం చేసుకుంటాం  కానీ తెల్లవారి వరకు జీవించగలవా అంటే అనుమానాస్పదమే  ప్రమాదంలో పడిపోవచ్చు గుండె ఆగిపోవచ్చు  రేపటిని చూడకుండానే ప్రాణాలు పోవచ్చు  కనుక నీ చేతిలో ఉన్నది  నేడు  దానిని ఎలా సక్రమంగా నీవు వినియోగించుకుంటావో  అది నీ చేతిలో ఉన్నది  నీవు మంచి చేస్తే  జీవితంలో  మంచిని చెడు చేస్తే జీవితంలో చెడును అనుభవించే బాధ్యత కూడా  నీదే అవుతుంది అని జ్ఞాపకం పెట్టుకో  కనుక మంచిగా మాట్లాడడం మంచిగా జీవించడం మంచిగా అందరిలో తలమాలికంగా ఉండడం నేర్చుకో.
=======================
సమన్వయం . డా. నీలం స్వాతి కామెంట్‌లు