తలరాతలు;- :- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 ఎక్కడో
సుదూరాన ఉన్న మేఘమాలలోంచి 
ప్రత్యక్షమైన దేవకన్యలా
విజయం ఉండదు
అయినా జనాలు కేవలం 
విజయాలనే గుర్తుంచుకుంటారు
చరిత్రను లిఖించేది
కేవలం విజేతల హస్తాలేకదూ!
విజేతలు తామేది కోరుకుంటే
అదే రాసుకుంటారు
అయినా
చరిత్ర చెప్పేసత్యం
ఒకటి బలంగానే ఉంది
విజేతలు ఎల్లప్పుడూ
శక్తివంతులుగా ఉండరుగా
అదుగో! అప్పుడు
విజేతల చేతిలో
ఓటమిపాలైన వారిదే 
పైచేయిగా మారుతుంది
ఇంకేం!?
ఒక్క సారిగా విజేతల 
తలరాతలు తలకిందులేకదా! 
అదేసమయంలోనే 
బాధితుల రాతలు, వ్యాఖ్యలు 
ప్రజల్లోకి విస్తరిస్తాయి 
చరితను పునర్లిఖిస్తాయి!!
**************************************

కామెంట్‌లు
visalakshi చెప్పారు…
చాలాబాగుంది