కొద్దిగా ఆహారాన్ని స్వీకరించడం వల్ల గౌతముడు కొంత బలాన్ని తెచ్చుకొని ఏకాగ్రతతో ధ్యానసాధన చేస్తూ ప్రతి వస్తువును ప్రతి చర్యను ఉన్నది ఉన్నట్లుగా చూసే స్థితికి చేరుకున్నాడు మలినాల్ని విసుద్ధం గావించుకున్న మనసు నిర్మలమై ప్రశాంతమైంది అప్పుడు సిద్ధార్థుడు పుబ్బనివాసానుస్సతి చుతూపపాత అసవక్షయాలనే మూడు జ్ఞానాలను తెలుసుకున్నాడు అంటే ఇంతకు మునుపు పుట్టుకలు గుర్తుకొచ్చే జ్ఞానం ఇతర జీవరాసులు వాటి కర్మల వల్ల పుట్టడం పెరగడం మరణించడం మళ్ళీ పుట్టడం అనే శత్రువపాత జ్ఞానం అంతేకాక మలినాలు మనసులోకి చొరబడక ముందే వాటిని నాశనం చేయగల అవపక్షయ యజ్ఞంలు కలిగాయి పుబ్బనివాసానుస్సతి జ్ఞానంతో సిద్ధార్థుడు ఇంతకు ముందరి పుట్టుకలను గుర్తుకు తెచ్చుకున్నాడు.ఇలా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పది 20-50 వేలు ఆ తర్వాత అనేక విష్య ఆవృత్తులను వాటి పరిణామాలను గుర్తుకు తెచ్చుకొని ఒక్కొక్క చక్రం చక్రవాకం లో తాను ఎవరికి ఎలా పుట్టి ఏమిటి? ఏమీ అనుభవించాడో గుర్తు తెచ్చుకున్నాడు ఒక్కో చక్రం(చక్రవాకం) లో తాను ఎవరికి ఎలాపుట్టి ఏమి తిని ఏమి అనుభవించాడో గుర్తు తెచ్చుకున్నాడు ఆనాటి మొదటి జాములో ఇలా పుబ్బనివాసానుసతి జ్ఞానాన్ని సాధించాడు సిద్ధార్థుడు తన మనసును ఇతర జీవరాశి పుట్టుక మరణం మళ్లీ పుట్టడం అనే విషయాలను తెలుసుకోవడానికి చుతూపజ్ఞానం వైపు మళ్ళించాడు స్వచ్ఛమైన మనసుతో అన్ని జీవరాసులు వాటి కర్మల ఫలాన్ని అనుసరించి ఒక అస్త్యత్వం నుంచి మరొక అశ్విత్వానికి మారటానికి గమనించాడు అకుశలమైన ఆలోచనలు మాటలు చేతల ద్వారా వారు చనిపోయిన తర్వాత దుఃఖమయమైన పుట్టుకకు గురి అవుతారని కుశలమైన ఆలోచనలు మాటలు చేతల ద్వారా చనిపోయిన తర్వాత వారి సుఖమైన పుట్టుకలను పొందుతారని తెలుసుకున్నాడు.ఇలా రెండవ జాములో సిద్ధార్థుడు చుతూపపాత జ్ఞానాన్ని పొందాడు విమల మనస్కుడైన సిద్ధార్థుడు అటు తర్వాత ఆనవాలను(మలినాలను) నాశనం చేసే దిశగా దృష్టిని సారించాడు దుఃఖాన్ని నిరోధించే మార్గం ఉంది ఇవి మలినాలు ఆసవాలు ఆ మలినాలు ఎలా ఏర్పడతాయి అలా ఏర్పడిన మలినాలను కడిగిపారేయడమేకాక నాశనం కూడా చేయవచ్చు ఇది ఆసవక్షయానికి మలినాల నిర్మూలనకు మార్గం అని తెలుసుకున్న సిద్ధార్థుడు ఆసపక్షయ జ్ఞానాన్ని పొందాడు దీనితో సిద్ధార్థుని మనసు వాంఛ అస్తిత్వ అవిద్య అనే మలినాలు నుంచి విముక్తుడై నేను విముక్తుడైనను నాకు మళ్ళీ పుట్టుక లేదు పవిత్ర జీవితం దక్కింది నేనింకా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు అన్న ఆనందంతో ప్రకటించాడు అసవక్షయంతో సిద్ధార్థకు జ్ఞానోదయమైంది సంబోధిని సంతరించుకున్న సిద్ధార్థులు సంయక్తబుద్ధుడైనాడు.
=======================
సమన్వయం . డా. నీలం స్వాతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి