స్నేహితుడుఅంటే మన
హితం కోరువాడు
మనం బాధలో ఉంటే ఓదార్పునిస్తాడు
మన సంతోషానికి చిరునామై నిలుస్తాడు
సుయోధనుడు, కర్ణుడి
స్నేహం
కృష్ణకుచేల మైత్రి
స్నేహబంధం యొక్క గొప్పతనాన్ని చాటాయి
పురాణేతిహాసాలలో ఇలాంటి స్నేహితులు ఎందరో మరెందరో
అందుకే అన్నారు నీ స్నేహితుడు*
ఎవరో చెప్పండి
నీగురించి నేను చెబుతాను అని
పసిప్రాయాన తల్లిదండ్రులు తోబుట్టువులు స్నేహితులు
బడిలో( ప్రాథమిక దశలో) కొందరు సమవయస్కుల మధ్యన ఏమితెలియని అమాయకపు స్నేహాలు
ఆతర్వాత కాలేజీ చదువులు
మన ఆలోచన విధానాలకు
దగ్గరగా ఉన్న వారు మన కోసం
సమయాన్ని ,ధనాన్ని మన చదువుసంధ్యల్లో తోడ్పాటునందించేవారు తిరిగి ఏమియు ఆశించనివారు
మనకెప్పుడు హితం బోధించువారు
చదువు పూర్తైన మనం ఉద్యోగం వ్యాపారం ఏది చేసినా మనం
ఎక్కడ ఉన్నా మన బాగోగులు
తెలుసుకునేవారు
మన ముందడుగుకై తానెప్పుడూ చేదోడువాదోడుగా
ఉండేవారు
వారే వారే నిజమైన స్నేహితులు
ఆధునిక కాలంలో ఇలాంటివారు
ఎందరని బియ్యంపు గింజల్లో వడ్లగింజలు
నేడు స్నేహితులు ,స్నేహాలు అంతా *స్వార్థపూరితమే
తమ తమ అవసరాలకు మనల్ని వాడుకొని తర్వాత ముఖం చాటేసేవారే
ఈ పెట్టుబడి దారి సమాజం వ్యాపార స్నేహాలనేఅభివృద్ధి చేసింది
ఆ వ్యాపార స్నేహసూత్రం
మాయింటికొస్తే మీరేమిస్తారు
మీ యింటి కొస్తే మళ్ళీ మీరేమిస్తారు అన్న సాయంమరిచిన అత్తిపత్తి సంబంధాలు పెరిగి పోయాయి
ప్రాణస్నేహితుడు అంటే మన కళ్ళ*
లోకి చూసి మన గుండెలోని
ఆవేదనంతా దూరం చేసేవాడు
ఉత్తమ స్నేహితుల గుణగణాలు
అఘము వలన మరల్చు *హితార్థు కలితుజేయు
గోప్యంబుదాచు
బోషించు గుణము విడువడాపన్ను లేవడి వేళ నిచ్చు
మిత్రుడీలక్షణంబుల మెలగుచుండు
మంచి స్నేహితుడు అనేవాడు
అబద్ధం ఆడనివ్వడు
మంచినే బోధిస్తాడు
ఆపద సమయంలో మనల్ని*
అంటిపెట్టుకొనే ఉంటాడు
ఆ ఆపద నుండి మనల్ని గట్టెక్కిస్తాడు
ఇలాంటి విశిష్ట లక్షణాలు( గుణాలు) కలిగినవారే*
మంచి స్నేహితులు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి