నేను ధనవంతుణ్ణి కాను
కానీ
అభిమాన ధనమున్నోడిని
నేను దగా,వంచన తెలియని వాడిని
కానీ
దయా జాలి కరుణ గలవాడిని
నేను నా రెక్కల కష్టం నమ్ముకున్న వాడిని
శ్రమ ఫలితాన్ని ఆత్మగౌరవ పతాకగా ఎగరేసినోడిని
సంతృప్తిని మించిన సంపద లేదని
ఎండమావులు వెంట పరిగెత్తే వాడను కాదని
దురాశకు దూరంగా ఉన్న వాడిని
స్వయంకృషి, స్వశక్తి
నా బ్రతుకుకు ఆలంబనని
తలంచిన వాడిని
ఆత్మవిశ్వాసం
ఆశావాదం
నా పేరు గా
మార్చుకున్నవాడిని
నేను సాధారణ మానవుడిని నేను అజాతశత్రువుడను
కానీ
అభిమాన ధనమున్నోడిని
నేను దగా,వంచన తెలియని వాడిని
కానీ
దయా జాలి కరుణ గలవాడిని
నేను నా రెక్కల కష్టం నమ్ముకున్న వాడిని
శ్రమ ఫలితాన్ని ఆత్మగౌరవ పతాకగా ఎగరేసినోడిని
సంతృప్తిని మించిన సంపద లేదని
ఎండమావులు వెంట పరిగెత్తే వాడను కాదని
దురాశకు దూరంగా ఉన్న వాడిని
స్వయంకృషి, స్వశక్తి
నా బ్రతుకుకు ఆలంబనని
తలంచిన వాడిని
ఆత్మవిశ్వాసం
ఆశావాదం
నా పేరు గా
మార్చుకున్నవాడిని
నేను సాధారణ మానవుడిని నేను అజాతశత్రువుడను

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి