బుద్ధుడు అలా కొంతకాలం పాటు ఆమ్రపాలి మామిడి తోపులో ఉండి తరువాత భిక్షు సంఘం వెంట బేలువ గ్రామాన్ని చేరుకున్నాడు బుద్ధుడు బేలువ గ్రామాన్ని చేరిన తర్వాత భిక్షువులతో భిక్షువు లారా వర్షాకాలం వచ్చింది మీరు మీ పరిచయస్తుల దగ్గర సాహస గాల్ల దగ్గర ఈ వర్షా వాసాన్ని గడపండి అని చెప్పాడు అలాగే భగవాన్ అని బదులు ఇచ్చిన భిక్షువులు తమకు అందుబాటులో ఉన్న సావాసగాళ్ల చెంత వర్షాకాలన్ని గడపడం ప్రారంభించారు బేలువ వర్షా వాసం చేస్తున్న బుద్ధుడు తీవ్రమైన నొప్పులు బాధతో కూడిన అనారోగ్యానికి గురయ్యాడు బయటికి చెప్పకుండా స్మృతితో ఎరుకతో ఆ బాధ ని భరించాడు ఇంతకాలం తనతో గడిపిన అనుచరులకు ఏమి చెప్పకుండా సంఘాన్ని విడిచిపెట్టి నిర్వాణం పొందడం సరికాదని రోగాన్ని అణిచిపెట్టి మరి కొంతకాలం బతికితే బావుండును అనుకున్నాడు మరి కొంతకాలానికి రోగం తగ్గుముఖం పట్టి పూర్తిగా కోలుకున్నాడు ఆతురశాల రోగులు ఉండే గది నుంచి బయటకు వచ్చి బస చేసిన విహారం వెనుక వైపుగా ఏర్పాటు చేసిన ఆసనం పై కూర్చున్నాడు అప్పుడు బుద్ధుని దగ్గరికి వెళ్ళిన ఆనందుడు చాలా కాలంగా చక్కటి ఆరోగ్యంతో కుశలంగా ఉండే బుద్ధుని చూడడానికి అలవాటు పడిన నాకు తథాగతులు రోగగ్రస్తులు కావడంతో నాలో ఏదో తెలియని జడత్వం ఆవరించి నా ఆలోచనలన్నీ మసకబారి పోయినాయి కుదుటపడ్డాను అని చెప్పాడు ఆనందా సంఘం నా నుంచి ఏం కోరుకుంటుంది నేను బోధించిన ధర్మం గూఢమైనది కాదు అందరకు విశదమైనదే.సత్యాన్ని విడమర్చి చెప్పడంలో నేను పిడికిలిలో దాల్చింది ఏమీ లేదు మీరు కొందరు అనుకోవచ్చు తథాగతుడు మాత్రమే సంఘానికి నాయకుడని సంఘం పూర్తిగా తథాగతులపై ఆధారపడి ఉన్నది తథాగతుడు మాత్రమే సంఘానికి సంబంధించిన ఏదైనా నిర్ణయం వెలువరిస్తాడు అని కానీ తథాగతుడు అలా ఎప్పటికీ అనుకోడు భిక్షు సంఘాన్ని నడపవలసినది తధాగతుడు కాదు భిక్షు సంఘం తథాగతుని మీద ఏమాత్రం ఆధారపడి లేదు మరి అలాంటప్పుడు సంఘానికి సంబంధించిన ఏ నిర్ణయమైనా ప్రకటననైనా తథాగతుడే చేయాలి అని అనుకుంటున్నాం అన్నది సరైనది కాదు ఆనందా ఇప్పుడు నాకు 87 నిండాయి అన్ని అరిగిపోయి విరిగిపోయి అతుకులకట్ల తో ముందుకు సాగే పాతబడిన బండి లాగే తధాగతుని శరీరం కూడా ఒడిలిపోయి కాలం వెళ్ల తీస్తోంది తథాగతులు ఏ నిమిత్తoలను తన మనసులోనికి రానీయకుండా కొన్ని వేదనలను అనుభవంలోకి తెచ్చుకోకుండా చిత్త సమాధి లోకి వెళతాడో అప్పుడే తధాగతుడు ఆరోగ్యంగా ఉంటాడు అని చెప్పి బుద్ధుడు తన ప్రసంగాన్ని ఇంకా కొనసాగించాడు తన సంఘానికి చెప్పదలుచుకున్నదంతా ఆనందుని ద్వారా సంఘానికి తెలియ చెప్పాడు.
===================================
సమన్వయం ; డా. నీలం స్వాతి
===================================
సమన్వయం ; డా. నీలం స్వాతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి