దైవ సమానులు తల్లిదండ్రులు ;- -గద్వాల సోమన్న,9966414580
తల్లిదండ్రుల ఋణము
ఎవరూ తీర్చలేరు
వారి గొప్ప త్యాగము
ఎక్కడ  చూడలేరు

కన్నవారి ప్రేమను
తీగలాంటి మనసును
చులకన చేయరాదు
గాయం రేపరాదు

వారు ఉంటే వెలుగు
శుభములెన్నో కలుగు
వారిపై గౌరవం
తగ్గకుండా మెలగు

కష్టపెట్ట కూడదు
కన్నవారినెప్పుడు
పనికిరానితనంతో
కాల్చుకుని తినరాదు


కామెంట్‌లు