నిజాల నిప్పు కణికలు;- -గద్వాల సోమన్న,9966414580
కలహాలతో నెమ్మది
సదనంలో పోతుంది
కలసివుంటే మంచిది
బలం చేకూరుతుంది

మహిళలుంటే దీవెన
ఇల్లు స్వర్గమవుతుంది
మమకారాల వంతెన
బంధం బలపడుతుంది

క్షమాగుణమే గొప్పది
చెలిమి కలిమి పెరుగుతుంది
ప్రతీకారం చెడ్డది
చెరుపు దాపురిస్తుంది

అబద్ధం విషతుల్యం
నమ్మకాన్ని  హరిస్తుంది
సత్యమే అమూల్యం
ఎప్పుడైనా గెలుస్తుంది


కామెంట్‌లు