తెలిమంచును తరిమేస్తూ
తొలి వెలుగులు ప్రసరిస్తూ
నులి వెచ్చని కిరణాలతో
చలి చీకటి తెర తీస్తూ....
పలు వన్నెల విరబూస్తూ.
తలిరాకుల చాటున దాగి
నును సిగ్గుల మొహమాటున
కనురెప్పల అంచున చూస్తూ...
రేకుల కన్నులు విప్పి
లోకపు వెలుగును చూసి
వేకువ వెలుగుల లో
నాకపు ఛాయలు తోచి...
మారెను ఋతువనుచూ
తీరగ తమ తనివే తీయగా
ఊరకనే ఉత్సాహంగా ఊహల
ఊయలలూగే కుసుమ సిరిబాలలు
నవ్వులకు కారణమేలా??
పువ్వులకు బంధాలేలా?
తవ్వుకుని పడే బాధలేలా??
ఎవ్వరికీ శాశ్వతం కాదీ ఇల!!
మనసే పూవుల మధువనమై
మమతే మాయని మకరందమై
మధుపాల బృందగానపు సందడితో
బ్రతుకే ఒక కమ్మని పండుగ చేసే
మధురమైన వేకువకు
🌸🌸 సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి